ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బిజీ హీరో ఎవరు? అంటే వెంటనే అందరూ నాని అని చెబుతారు. మినిమం గ్యారెంటీ హీరో ఎవరు అంటే..? నాని పేరు చెబుతారు. ఈ మధ్య నాని సుడి మాములుగా తిరగడం లేదు. చేతిలో నాలుగైదు సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నాని..ఇప్పుడు నేచురల్ స్టార్ హోదాని అనుభవిస్తున్నాడు. టాలీవుడ్‌లోని దర్శకనిర్మాతలంతా ఇప్పుడు నాని డేట్స్ కోసం చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో..? టాలీవుడ్ సంగతి సరే..ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ కూడా.. నాని కోసం ఎంక్వైరీ చేస్తుంది.
ఎవరా భామ అనుకుంటున్నారు కదా..? ఇంకెవరు ప్రియాంకా చోప్రా. ఈ మధ్య హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి..దుమ్ము రేపుతున్న ప్రియాంకాకి నానితో పనేంటి అనుకుంటున్నారు..కదా..! హాలీవుడ్‌కి వెళ్ళినా.., ఈ భామ ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అందులో ఇండియన్ సినిమాకి సంబంధించిన అన్ని భాషల్లో సినిమాలు తీయాలని చూస్తుంది. ఇప్పుటికే భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ భాషల్లో చిత్రాలు చేసిన ఈ భామ..కన్ను ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. టాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ హీరో ఎవరు అని ఎంక్వైరీ చేసిన ప్రియాంకాకి..నాని పేరు గట్టిగా వినబడటంతో...వెంటనే నానితో సినిమా చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. నాని కనుక డేట్స్ ఇవ్వగల్గితే..2017లో అతనితో ప్రియాంకా చోప్రా సినిమా తీసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన యష్‌రాజ్ సంస్థలో నాని ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అయినా..నాని కి మళ్లీ ఛాన్స్ వచ్చిందంటే..నాని నిజంగా సో లక్కీ అని చెప్పుకోవాల్సిందే.