మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ భార్య అయిన ఉపాసన ఇప్పుడు చిరంజీవి చేస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'కి సంబంధించి ఓ ఫంక్షన్‌ని ఆర్గనైజ్ చేయబోతుంది. ఈ చిత్రానికి నిర్మాత రామ్‌చరణ్ కావడంతో..ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ని స్వయంగా ఉపాసనే ఆర్గనైజ్ చేయనుందట. అల్రెడీ చిరంజీవికి సంబంధించిన మెగా60 బర్త్‌డే ఈవెంట్‌ని పార్క్ హయత్‌లో ఆర్గనైజ్ చేసిన అనుభవం ఉండటంతో..ఈ బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఉపాసనకి రెండో ఈవెంట్.
మెగా60 బర్త్‌డే ఈవెంట్‌ని ఎంతో ఘనంగా నిర్వహించి, అందరి ప్రశంసలు అందుకున్న ఉపాసన పవన్‌కళ్యాణ్‌తో సహా మెగా హీరోలందరూ అటెండ్ అవుతున్న ఈ ఫంక్షన్‌ని ఇంకెంత గ్రాండ్‌గా చేస్తుందో అని..మెగాభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఫంక్షన్‌కి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో మెగా ఫ్యామిలీ నుండి తెలియనున్నాయి.