Advertisementt

ఎన్‌టిఆర్‌కి కథ నచ్చింది..కానీ డైరెక్టరే..!

Fri 25th Nov 2016 11:56 AM
jr ntr,janatha garage,bobby,sardaar gabbar singh director,anil ravipudi  ఎన్‌టిఆర్‌కి కథ నచ్చింది..కానీ డైరెక్టరే..!
ఎన్‌టిఆర్‌కి కథ నచ్చింది..కానీ డైరెక్టరే..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్‌టిఆర్‌ 'జనతా గ్యారేజ్‌' తర్వాత చేయబోయే చిత్రంపై గత కొన్ని రోజులుగా అనేకానేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ఎంతోమంది డైరెక్టర్స్‌ పేర్లు వినిపించాయి. వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అయ్యే చిత్రం నుండి..తాజాగా కృష్ణవంశీ వరకు లిస్ట్‌లో చాలా మంది డైరెక్టర్ల పేర్లే వినిపించాయి. అయితే ఎన్‌టిఆర్‌ సైడ్‌ నుండి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్‌ రాలేదు. ఎన్‌టిఆర్‌ చేసిన 'జనతా గ్యారేజ్‌' టీవీలో కూడా వచ్చేసింది. కానీ ఎన్‌టిఆర్‌ నుండి తన తర్వాత చిత్రంపై ఇంత వరకు డెసిషన్‌ రాకపోవడం వల్లనూ, తనతోటి స్టార్‌ హీరోలు ఒక్కొక్కరు వరుసగా నాలుగైదు సినిమాలు ఎనౌన్స్‌ చేయడం వల్లనూ..ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్‌ కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఎన్‌టిఆర్‌ ఎప్పుడెప్పుడు తన తర్వాత చిత్రం గురించి అనౌన్స్‌ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే అతి త్వరలో ఎన్‌టిఆర్‌ తన తర్వాత చిత్రం గురించి చెప్పే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదెలా అంటే ప్రస్తుతం ఎన్‌టిఆర్‌కి ఇద్దరు డైరెక్టర్స్‌ స్టోరీలైన్‌ను వినిపించారట. అవి రెండు ఎన్‌టిఆర్‌కి ఎంతగానో నచ్చాయంట. ఆ ఇద్దరు ఎవరో కాదు..అనిల్‌ రావిపూడి అండ్‌ బాబి (సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌). ఇందులో బాబీ చెప్పిన స్టోరీలైన్‌ ఎన్‌టిఆర్‌కి బాగా నచ్చిందట కానీ..డైరెక్షన్‌ని బాబీకి ఇవ్వడానికి ఎన్‌టిఆర్‌ ఆలోచిస్తున్నాడట. స్టోరీని తీసుకుని ఎవరైనా టాప్‌ డైరెక్టర్‌తో చేయాలా..లేక బాబీకి ఛాన్స్‌ ఇవ్వాలా అనే ఆలోచనలో ఎన్‌టిఆర్‌ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏ విషయం ఈ వీక్‌లో తెలిసిపోతుందని ఎన్‌టిఆర్‌ సన్నిహిత వర్గాల నుండి తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ