'దేవదాసు' వంటి హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చి, తన పెదనాన్న, సీనియర్ నిర్మాత స్రవంతి కిషోర్ అండతో పలు హిట్ చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్‌కు చేరువైన హీరో రామ్. కాగా ఈ యంగ్ హీరో కొంతకాలంగా సరైన హిట్‌లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసి ఈ ఏడాది జనవరి1న విడుదలైన 'నేను..శైలజ' చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన 'హైపర్' ఫర్వాలేదనిపించుకుంది. కాగా ప్రస్తుతం ఆయన తన కెరీర్‌ను మరోసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన 'నేను..శైలజ' డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మరో చిత్రం చేస్తానని కూడా ప్రకటించాడు. కానీ ఈ చిత్రం ప్రారంభానికి సమయం పట్టేలా ఉంది. ఇంతలో 'పటాస్, సుప్రీమ్' ఫేమ్ అనిల్‌రావిపూడి ఆయనకు ఓ స్టోరీ చెప్పాడని వార్తలు వచ్చాయి. వైవిధ్యభరితమైన, ప్రయోగాత్మకంగా రూపొందించేలా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. ఇందులో హీరో పాత్ర అంధునిగా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో రామ్ ఆ చిత్రం చేయదలుచుకోలేదు. దాంతో ఆయన అనిల్‌రావిపూడికి నో చెప్పాడు. కాగా ఈ కథను ఆల్‌రెడీ మొదట అనిల్‌రావిపూడి ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయన కూడా ఈ స్టోరీని నో అన్న తర్వాతే ఆయన రామ్‌కు ఈ కథ చెప్పి ఆయన్ని కూడా ఒప్పించలేకపోయాడు. కాగా జనవరిలో రామ్ తన కొత్త చిత్రం ప్రారంభించనున్నాడు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరణ్ దర్శకత్వంలో చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఎందుకంటే.. ప్రేమంట' చిత్రం ఫ్లాప్ అయింది. అయినా కూడా రామ్ ఈసారి తన ఓటు కరుణాకరన్‌కే వేశాడు. మరి ఈ కొత్త చిత్రంతోనైనా రుణాకరన్ రామ్ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో వేచిచూడాల్సివుంది.