Advertisementt

విజయశాంతి ముఖం చాటేసింది అందుకేనా?

Wed 23rd Nov 2016 09:22 PM
vijaya shanthi,t krishna,prathighatana movie,vendithera aruna kiranam t krishna book  విజయశాంతి ముఖం చాటేసింది అందుకేనా?
విజయశాంతి ముఖం చాటేసింది అందుకేనా?
Advertisement
Ads by CJ

అభ్యుదయ భావాల దర్శకుడు టి.కృష్ణ పేరు చెప్పగానే ఆయన తీసిన 'ప్రతిఘటన' సినిమా గుర్తుకువస్తుంది. తక్కువ కెరీర్ లో ఆయన తీసిన ఎనిమిది సినిమాల్లో ఆరు తెలుగు చిత్రాలున్నాయి. ఈ ఆరింటిలో విజయశాంతి నాయికగా నటించింది. ఆమె కెరీర్ కు బ్రేక్ నిచ్చి, మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం 'ప్రతిఘటన'. టి.కృష్ణ అంటే విజయశాంతికి కూడా చాలా అభిమానం ఉంది. అయితే ఇటీవల టి.కృష్ణపై ఒక జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విజయశాంతి వస్తుందని నిర్వాహకులు చెప్పారు. కానీ ఆమె డుమ్మా కొట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. టి.కృష్ణ సినిమాల్లో నటించిన సుమన్ తో పాటుగా ఇతర ఆర్టిస్టులు వచ్చారు. డా.రాజశేఖర్ విదేశాల్లో ఉన్న కారణంగా రాలేదు. నిర్మాతలు, రచయితలు, అభిమానులు అనేక మంది హాజరయ్యారు. అయినప్పటికీ విజయశాంతి రాని లోటు స్పష్టంగా కనిపించింది. తొలుత వస్తానని చెప్పి రాకపోవడానికి కారణం మీడియా కంటపడకుండ ఉండేందుకే అని అంటున్నారు. వయసురీత్య, అనారోగ్యం కారణంగా ఆమెలో అనేక శారీరక మార్పులు వచ్చాయట. విజయశాంతి అనగానే ఆమె గ్లామర్ గుర్తుకువస్తుంది. అలాంటిది డీ గ్లామర్ తో కనిపిస్తే తన ఇమేజ్ కు ప్రాబ్లమ్ అనే ఉద్దేశంతో ముఖం చాటేసిందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ