రూపాయి ఖర్చు లేకుండా మీడియాను ఆకర్షించడం ఎలాగో రామ్ గోపాల్ వర్మ వద్ద నేర్చుకోవాలి. నిత్యం వార్తల్లో ఉండడం వర్మ పద్దతి. దానికోసం ఆయన కాంట్రవర్సీ సృష్టిస్తారు. ఇప్పుడు నటుడు, దర్శకుడు రవిబాబు కూడా మీడియా దృష్టిలో పడడం కోసం మరో మార్గం ఎంచుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లో రవిబాబు తెలుపు వర్ణం పంది పిల్లను చంకనేసుకుని ఏటీఎమ్ కేంద్రానికి వెళ్ళారు. అక్కడ అప్పటికే క్యూ ఉంది. దాంతో తనుకూడా లైన్ లో నిల్చున్నారు. చంకలో పంది పిల్లతో వచ్చిన వ్యక్తి ఎవరాని అంతా ఆశ్చర్యపోయారు. రవిబాబు అని గుర్తుపట్టారు. అనుమానంగా చూశారు. సినిమా స్టారు ఇలా రావడమేమిటని అనుకున్నారు. ఈ సీన్ అంతా రవిబాబు క్రియేట్ చేసిందే. ఆయన నిజంగానే ఏటిఎమ్‌కు వెళ్ళారు. పంది పిల్లతో ఎందుకంటే ఆయన తాజా చిత్రం పేరు 'అదుగో..'. ఇందులో పందిపిల్ల ముఖ్యపాత్ర చేస్తోంది. ఈ కారణం చేత ప్రచారం కోసం రవిబాబు ఏటిఎమ్ బాటపట్టారు. నిజంగా ఆయన తెలివితేటలను అభినందించాల్సిందే.