Advertisementt

వెనకడుగు వేసిన గురు..!

Wed 23rd Nov 2016 05:25 PM
victary venkatesh,guru movie,chiranjeevi,balakrishna,khaidi 150,gpsr  వెనకడుగు వేసిన గురు..!
వెనకడుగు వేసిన గురు..!
Advertisement

వాస్తవానికి వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌150', బాలయ్య వందో చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'; దిల్‌రాజు నిర్మాతగా శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న 'శతమానం భవతి' చిత్రాలతో పాటు వెంకటేష్‌ నటిస్తున్న 'గురు' చిత్రం కూడా విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. కాగా మొదట్లో ఈ రేసులో నాగార్జున నటిస్తున్న 'నమో వేంకటేశాయ' చిత్రం కూడా ఉంటుందని భావించినప్పటికీ ఇంతటి పోటీలో తన చిత్రం విడుదల చేయడం ఇష్టంలేక నాగ్‌ తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు.అదే నాగార్జున కిందటి ఏడాది సంక్రాంతికి 'నాన్నకుప్రేమతో', 'డిక్టేటర్‌', 'ఎక్స్‌ప్రెస్‌రాజా' వంటి చిత్రాల రిలీజ్‌ ఖరారైనప్పటికీ తాను నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని కూడా విడుదల చేసి మిగిలిన అన్ని చిత్రాల కంటే సంక్రాంతికి తన చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ అయ్యేలా చేసుకున్నాడు. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విషయం వేరు. ఈ చిత్రం అచ్చమైన తెలుగు కథతో నవరసాలతో నిండి ఉండటంతో పెద్ద ఘనవిజయం సాధించింది. కానీ ప్రస్తుతం తాను రిలీజ్‌ చేయాలనుకున్న 'నమో వేంకటేశాయ' చిత్రం అలాంటి చిత్రం కాదు. దీంతో ఆయన ముందుగానే మంచి నిర్ణయం తీసుకొని తన చిత్రాన్ని బరిలో దింపకుండా వాయిదా వేసుకున్నాడు. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా'తో నాగ్‌ సాధించిన విజయం చూసిన వెంకటేష్‌ ప్రస్తుతం తాను చేస్తోన్న 'సాలాఖద్దూస్‌' రీమేక్‌ 'గురు'ను సంక్రాంతి బరిలో దించాలని భావించాడు. కానీ ఈ చిత్రం వెంకీకి ఉన్న బలమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాకపోవడం, కేవలం ఈ చిత్రం కూడా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరించే చిత్రం కావడం, బాక్సింగ్‌ నేపథ్యంలో బాక్సింగ్‌ కోచ్‌గా నటిస్తున్న వెంకీ చేస్తున్న పాత్ర మాత్రమే కాదు.. సినిమా అంతా సీరియస్‌ మూడ్‌లో సాగేచిత్రం కావడం, తెలుగు నేటివిటీకీ దూరంగా ఉండే చిత్రంగా రూపొందుతుండటం, పూర్తి రీమేక్‌గా కాకుండా సెమీ రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం కావడం.. వంటి కారణాలతో తన 'గురు' విడుదల విషయంలో ముందుగానే జాగ్రత్త పడ్డాడని అంటున్నారు. సురేష్‌బాబు అనుకుంటే ఎంత పోటీ ఉన్నప్పటికీ వెంకీ చిత్రానికి థియేటర్లు వస్తాయి. కానీ వెంకీ మాత్రం అంత సాహసం చేయకుండా, నాగ్‌లాగానే తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడట. బాలయ్య, చిరంజీవి వంటి హీరోల హడావుడి ముగిసిన రెండు వారాలకు జనవరి 26న 'గురు'ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement