Advertisementt

ఇక అడ్డేముందంటున్న జంట..!

Wed 23rd Nov 2016 03:31 PM
naga chaitanya,samantha,love story,twitter,  ఇక అడ్డేముందంటున్న జంట..!
ఇక అడ్డేముందంటున్న జంట..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, సమంతల సీక్రెట్ లవ్ ఇప్పుడు ఓపెన్ అయ్యిపోయింది. ఇక దాచుకోవడం ఎందుకని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు. అసలే ఇప్పుడు సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదాయె. ఏదో తమిళం లో రెండు మూడు సినిమాలు సైన్ చేసినా కూడా ప్రస్తుతానికి నాగ చైతన్యకి అందుబాటులోనే ఉంటుంది. ఇక చైతూ కూడా ప్రేమమ్ హిట్ తో ఫుల్ జోష్ లో వున్నాడు. అయితే సాహసం శ్వాసగా సాగిపో సినిమా ప్లాప్ అయినా చైతూ ఏ మాత్రం బాధపడడం లేదు సరికదా తన గర్ల్ ఫ్రెండ్ సమంతతో చెట్టాపట్టాలేసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలిప్పటికే సమంత తన సోషల్ మీడియా పేజీ లో తాను నాగ చైతన్యతో వున్న లవ్ గురించి అభిమానులకు ఎలా చేరవెయ్యాలో అలా చేరవేసింది. ఇక ఇప్పటివరకు వున్న ట్విట్టర్ మరియు పేస్ బుక్ లకి తోడు ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగు పెట్టింది సామ్.  ఇక ఈ  ఇన్స్టాగ్రామ్ లో సమంత తనకి నచ్చిన ఫోటోలను తన అభిమానులకి బాగానే చేరవేస్తుంది. దానిలో భాగంగానే సమంత ఇప్పుడు తాను నాగ చైతన్యతో గడిపిన క్షణాలను ఒక ఫోటో రూపం లో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో సమంత, నాగ చైతన్యతో ఎంత ఉల్లాసంగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో మీరు ఒకసారి తిలకించండి. ఇక ఈ ఫొటోలో నాగ చైతన్య, సమంతతో బాగా దగ్గరగా కూర్చుని క్లోజ్ గా కబుర్లు చెబుతున్నాడు. ఆ పిక్ మీకోసం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ