మాస్‌మహారాజా రవితేజ 'బెంగాల్‌టైగర్' చిత్రం తర్వాత మరో చిత్రం చేయలేదు. గత 11నెలలుగా ఆయన ఖాళీగానే ఉన్నాడు. ఏడాదికి మూడునాలుగు చిత్రాలు చేస్తూ బిజీగా ఉండే ఆయన నుండి ఒక్క చిత్రం కూడా రాకపోవడంతో ఆయన చేసే తరహా చిత్రాల అభిమానులు, ఆయన ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇప్పటికే ఆయన వేణుశ్రీరాం, చక్రి, విక్రమ్‌సిరి, బాబి, చందు మొండేటి వంటి దర్శకులతో సినిమాలు చేస్తానని మాట తప్పాడు. ప్రస్తుతం రవితేజ తన ఫ్యామిలీతో కలిసి ప్రపంచ పర్యటన చేస్తున్నాడు. కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో రవితేజకు చిత్రాలకు సంబంధించి ఓ హట్‌టాపిక్ నడుస్తోంది. ఓ కొత్త నిర్మాతతో ఆయన జనవరి నుంచి రెండు చిత్రాలను ఒకేసారి ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రవితేజతో ఒకేసారి రెండు చిత్రాలను నిర్మించనున్న నిర్మాత ఎవరు? ఆ చిత్రాలకు ఎవరెవరు దర్శకత్వం వహిస్తారనే ఉత్కంఠ అందరినీ వేధిస్తోంది. ఏదిఏమైనా రవితేజ ఒకేసారి రెండు చిత్రాలు చేస్తాడనే వార్త ఆయన అభిమానులకు తీపి కబురుగానే చెప్పుకోవాలి. అయినా ఇప్పటికే ఎందరికో ఓకే చెప్పి, ఆ తర్వాత మాటతప్పిన రవితేజ ఈసారైనా మాటమీదనిలబడతాడా? ఆ నిర్మాతకు హ్యాండ్ ఇవ్వకుండా చేస్తాడా? అనేది ఆయన గతానుభవాల వల్ల ఇప్పటికీ ప్రశ్నార్ధకమే అని కొందరు అంటున్నారు.