Advertisementt

అవికా కి అసభ్య మెసేజ్లు పంపుతున్నదెవరు?

Wed 23rd Nov 2016 12:10 PM
avika gor,avika gor controversy,young hero,avika gor fire on young hero  అవికా కి అసభ్య మెసేజ్లు పంపుతున్నదెవరు?
అవికా కి అసభ్య మెసేజ్లు పంపుతున్నదెవరు?
Advertisement
Ads by CJ

అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగువాళ్ళకు బాగా దగ్గరైంది. అసలు అవికా గోర్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. చిన్నారి పెళ్లికూతురులోని ఆనంది పేరుతోనే అవికా బాగా ఫేమస్ అయ్యింది. ఇక టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయిన సినిమాలే. అయితే అవికా గోర్ ఎక్కువగా యంగ్ హీరోలతోనే కనిపించింది. రాజ్ తరుణ్ తో రెండు సినిమాలు, నాగసౌర్య తో ఒక సినిమా, సంతోష్ శోభన్ తో మరో సినిమా చేసిన అవికా తాజాగా నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో నటించింది. ఇంతమంది యంగ్ హీరోలతో నటించిన అవికా గోర్ కి ఇప్పుడు ఒక యంగ్ హీరో నుండి వేధింపులు స్టార్ట్ అయ్యాయట. ఆ యంగ్ హీరో అవికా వాట్స్ అప్ నెంబర్ కి అశ్లీల పదాలతో కూడిన అసభ్య మెసేజ్ లు  పంపుతున్నాడట. అయితే మొదట్లో ఎవరో ఆకతాయి పంపుతున్నాడని సరిపెట్టుకున్న అవికా ఆ మెసేజ్ లు పంపుతున్నది ఒక యంగ్ హీరో అని తెలుసుకుని షాక్ అయ్యిందట. వెంటనే ఈ విషయాన్ని అవికా తన సన్నిహితులైన రకుల్, రాజ్ తరుణ్, నిఖిల్, సాయి ధరమ్ తేజ్ లకు చెప్పిందట. అసలు ఇలాంటివి చూస్తుంటే తెలుగు సినిమాల్లో నటించాలంటే భయమేస్తుందని వారి దగ్గర తన ఆవేదన వెళ్ళగక్కిందని చెబుతున్నారు. అసలు ఇక్కడి హీరోల తీరు ఏం బాగోలేదని ఇక తెలుగులో నటించాలంటే చాలా జాగ్రత్తగా వుండాలని అంటోందట. అయితే ఆ అసభ్య మెసేజ్ లు పంపిన యంగ్ హీరో కోసం ప్రస్తుతానికి గాలింపు చేపట్టారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ