Advertisementt

ఈ హీరోయిన్ యాంకర్ అవుతుందట..!

Wed 23rd Nov 2016 10:23 AM
madhavi latha,nani,madhavi latha turns anchor,heroine turns anchor,jabardasth  ఈ హీరోయిన్ యాంకర్ అవుతుందట..!
ఈ హీరోయిన్ యాంకర్ అవుతుందట..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న తెలుగమ్మాయిలు ఎందరో వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఆ లిస్ట్ లో ముందుంటుంది మాధవి లత. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తరువాత నానితో కలిసి స్నేహితుడా సినిమాలో నటించింది. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినప్పటికీ తన పేస్ బుక్ పేజీ ద్వారా 48 లక్షల అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉంటుంది. అయితే ఈ భామ ప్రస్తుతం బుల్లి తెర పై యాంకర్ గా మారడానికి రెడీ అవుతుందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఓ ఛానల్ త్వరలో 'జబర్దస్త్' వంటి కామెడీ షో ను ప్లాన్ చేస్తుందట. ఈ ప్రోగ్రామ్ కి ఈ తెలుగమ్మాయి ను ఇటివలే సంప్రదించారట. ఈ షో తో పాటు మరి కొన్ని షో లతో మళ్ళీ టాలీవుడ్ లో పూర్వ వైభవం పొందేందుకు ప్రయత్నిస్తుందట మాధవి లత. మరి ఈ వార్త నిజమైతే ఈ తెలుగు కథానాయిక పొట్టి బట్టలతో హాట్ యాంకర్ గా మారి అనసూయ, రేష్మి, శ్రీముఖి వంటి యాంకర్ ల రూట్ లో వెళ్తూందేమో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ