Advertisementt

బాలయ్యతో కాదు ఎన్టీఆర్ తో నంట..!

Tue 22nd Nov 2016 12:10 PM
balakrishna,jr ntr,raithu movie,krishna vamsi,big b  బాలయ్యతో కాదు ఎన్టీఆర్ తో నంట..!
బాలయ్యతో కాదు ఎన్టీఆర్ తో నంట..!
Advertisement
Ads by CJ

కృష్ణవంశీ, బాలకృష్ణ 101వ చిత్రానికి డైరెక్టర్ గా ఖరారైపోయాడు. బాలకృష్ణ 101 వ చిత్రం 'రైతు' కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతోందని ఎప్పుడో ఫిక్స్ అయిపొయింది. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పూర్తవ్వగానే రైతు సినిమా సెట్స్ పై కెళుతుందని భావించారంతా. ఇక ఈ రైతు లో బాలకృష్ణ తో పాటు ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలకృష్ణ, కృష్ణవంశీ కలిసి అమితాబ్ దగ్గరకు కూడా వెళ్లారు. అయితే అమితాబచ్చన్.. బాలకృష్ణ రైతు చిత్రంలో చెయ్యడానికి రెడీ అయినా కూడా కాల్షీట్స్ ప్రాబ్లెమ్ వచ్చి చేయలేనని చెప్పాడని అంటున్నారు. ఇక అమితాబ్ కి కుదరకపోతే ఆ కేరెక్టర్ కి ఇంకెవరిని తీసుకోవాలో తెలియక కృష్ణవంశీ, బాలకృష్ణ దీర్ఘాలోచనలో పడ్డారట. దాంతో ఇక ఈ చిత్రం దాదాపు ఆగిపోయినట్లే అని వార్తలొస్తున్నాయి. ఇక దీనిపై అటు బాలకృష్ణ గాని ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ గాని ఎక్కడా స్పందించలేదు.

ఇక రైతు సినిమా పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. కృష్ణవంశీతో పని చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కృష్ణవంశీ, జూనియర్ ఎన్టీఆర్ తో  'రాఖీ' చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఇక ఆ సినిమా ఎన్టీఆర్ కి నటనపరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు రెండు మూడు హిట్ల జోరులో వున్న ఎన్టీఆర్ ఏ దర్శకుడితో పని చెయ్యాలో అని తెగ ఆలోచించి కృష్ణవంశీతో కమిట్ అవుతున్నాడని అంటున్నారు. కృష్ణవంశీ తో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. 

అయితే కృష్ణవంశీ మాత్రం అయన డైరెక్ట్ చేస్తున్న నక్షత్రం సినిమాకి తుది మెరుగులు దిద్ది విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇక నక్షత్రం సినిమా విడుదల కాగానే కృష్ణవంశీ, ఎన్టీఆర్ కథ గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ