Advertisementt

హమ్మయ్య.. ఆ సినిమాకు మోక్షం లభిస్తోంది!

Tue 22nd Nov 2016 11:15 AM
anjali,chitrangada,abhishek pictures,chitrangada release  హమ్మయ్య.. ఆ సినిమాకు మోక్షం లభిస్తోంది!
హమ్మయ్య.. ఆ సినిమాకు మోక్షం లభిస్తోంది!
Advertisement
Ads by CJ

తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇక్కడ సరిగా అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలలో నటించి, అక్కడి దర్శకనిర్మాతలను, ప్రేక్షకులను అలరించి, విజయవంతమైన పలు తమిళ చిత్రాలలో నటించిన టాలెంటెడ్‌ హీరోయిన్‌ అంజలి. అలా ఆమె నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్‌ అయి విజయం సాధించడంతో తెలుగు దర్శకనిర్మాతల, హీరోల దృష్టి ఆమెపై పడింది. దీంతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సీనియర్‌ స్టార్‌ వెంకటేష్‌కు జోడీగా, కీలకమైన టైటిల్‌ రోల్‌ అయిన 'సీతమ్మ' పాత్రకు ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన అద్బుతం. ఇక ఆ తర్వాత 'బలుపు, గీతాంజలి' వంటి పలు చిత్రాలలో నటించి, ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన నిర్మాతలకు సరిగా అందుబాటులో లేక రేసులో వెనుకబడింది. కాగా ఆమె ఆమధ్య చాలాకాలం కిందట 'పిల్ల జమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో 'చిత్రాంగద' అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం అనేక కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడు అశోక్‌.. అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' అనే మరో లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకాలానికి ఆయన తీసి, బాక్సుల్లో మూలపడిన అంజలి 'చిత్రాంగద' చిత్రానికి మోక్షం లభించనుంది. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత సొంతం చేసుకుని త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నాడు. మొదట్లో తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని ఆయన భావించినప్పటికీ తమిళ వెర్షన్‌ పనులు కాస్త పెండింగ్‌ ఉండటంతో ముందుగా తెలుగులోనే ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. మరి ఈ చిత్రం అంజలికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ