Advertisementt

బన్నీకి...బిస్కెట్‌ వేస్తోందా..!

Tue 22nd Nov 2016 08:43 AM
allu arjun,ekkadiki pothavu chinnavada,nanditha swetha,biscuit  బన్నీకి...బిస్కెట్‌ వేస్తోందా..!
బన్నీకి...బిస్కెట్‌ వేస్తోందా..!
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టైలిష్‌స్టార్‌ బన్నీ కంట్లో పడాలని ఏ హీరోయిన్‌ అయినా కోరుకుంటుంది. అందులో ఎలాగో మెగాక్యాంపులో ఒక్క అవకాశం వస్తే ఇక ఆ హీరోల నుండే వరస ఆఫర్లు వస్తాయనే ప్రచారం కూడా ఉంది. కాగా ఇటీవలి కాలంలో చాలామంది కొత్త హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల అటెన్షన్‌ను కూడా తమవైపుకి తిప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్స్‌ పక్కన కూడా అవకాశాలు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు. 'నేను..శైలజ' ఫేమ్‌ కీర్తి సురేష్‌ను దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె పవన్‌ సరసన త్రివిక్రమ్‌ సినిమాలో కన్‌ఫర్మ్‌ అయింది. ఇక కొరటాల శివతో మహేష్‌ చిత్రంలో కూడా స్దానం సంపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఇటీవలి కాలంలో నేచురల్‌స్టార్‌ నాని సరసన 'జెంటిల్‌మేన్‌'చిత్రంలో నటించిన నివేధా థామస్‌, 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ద్వారా తమిళ, తెలుగు వర్షియన్స్ లో గౌతమ్‌మీనన్‌ పరిచయం చేసిన మంజిమామోహన్‌లతో పాటు తాజాగా యువహీరో నిఖిల్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంలో అదరగొట్టే పెరఫామెన్స్  ఇచ్చిన కన్నడ నటి నందితా శ్వేతలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో నందితా నటనకు ఎంతో రెస్పాన్స్‌ లభిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఆమె నటనను చూసిన బన్నీ ఆమెకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి ఆమె నటనను ఎంతగానో మెచ్చుకున్నాడట. దీంతో ఆమె ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఒకవైపు బన్నీలాంటి స్టార్‌ తనకు స్వయంగా ఫోన్‌ చేసి అభినందించడంపై అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బన్నీతో ఎప్పటి నుంచో నటించాలని ఉందంటూ బన్నీని ఆకాశానికి ఎత్తుతోంది. మొత్తానికి ఈ భామ అప్పుడే బన్నీకి తద్వారా మెగా క్యాంపుకు బిస్కెట్‌ వేస్తూ తన లౌక్యాన్ని ప్రదర్శిస్తోందని టాలీవుడ్‌ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ