టాలీవుడ్ లో పరిచయమైన సినిమాకే పెద్ద బ్యాగ్రౌండ్, పేరున్న ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ అక్కినేని సరసన నటించేసింది సాయేషా. అక్కినేని అఖిల్ కి కూడా తొలి సినిమా కావడంతో వీరి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సాయేషా మొదటి టాలీవుడ్ చిత్రం 'అఖిల్' ఎంత పెద్ద ప్లాపో అందరికి తెలుసు. ఎలాగైనా మొదటి సినిమాతోనే భారీ సినిమాలో నటించి టాలీవుడ్ లో సెటిల్ అవుదామని అనుకున్న సాయేషాకి 'అఖిల్' ప్లాప్ తో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక్కడ అవకాశాలు రాక అమ్మడు అక్కడ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. బాలీవుడ్ లో ఏకంగా సీనియర్ హీరో అజయ్ దేవగన్ పక్కన ఛాన్స్ కొట్టేసి అక్కడైనా సెటిల్ అవుదామనుకుంది. కానీ అజయ్ దేవగన్ తో చేసిన సినిమా కూడా ఘోరమైన ప్లాప్ అవ్వడంతో సాయేషా ఇప్పుడు ఒక గట్టి నిర్ణయానికి వచ్చిందట. అదేమిటంటే ఇక మడికట్టుకుని కూర్చుంటే కుదరదని లిప్ లాక్ కిస్సులకి, బికినీలకి సై అందామని డిసైడ్ అయ్యిందట. ఇక దేనికైనా రెడీ అనే ధోరణిలో సాయేషా ఉందని ఈ విషయాన్నే అటు బాలీవుడ్ నిర్మాతలకి, డైరెక్టర్స్ కి ఇటు దక్షిణాది నిర్మాతలకు, డైరెక్టర్స్ కి కూడా చేరవేసిందని అంటున్నారు. అయితే నిజంగా సాయేషా దేనికైనా రెడీనా లేకుంటే ఇది గాసిప్ అనేది మాత్రం ఇప్పుడు సాయేషా నటించే కోలీవుడ్ సినిమాపై ఆధారపడిందని అంటున్నారు. ప్రస్తుతానికి సాయేషా కోలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు సాయేషా చేసే గ్లామర్ షో ని బట్టి ఆమెకు ఛాన్స్ లు ఇచ్చే ఆలోచన పెట్టుకుందామని అనుకుంటున్నారట.