Advertisementt

దేశమంతటా బ్లాక్ అండ్ వైట్ దందానే...!

Mon 21st Nov 2016 05:44 PM
black money,black ways go to change black money to wight money,pm narendra modhi   దేశమంతటా బ్లాక్ అండ్ వైట్ దందానే...!
దేశమంతటా బ్లాక్ అండ్ వైట్ దందానే...!
Advertisement
Ads by CJ

పెద్ద నోట్లను రద్దు చేసి మోదీ సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నల్లకుబేరులు బ్లాక్ గా పడి ఉన్న మనీ స్థానం కొత్త కట్టలను పేర్చుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందుకు పలు మార్గాలను వెతుకుతున్నారు. పలు రంగాల్లో ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్‌లో బ్లాక్ మనీతో తమ గోదాములలో  నింపుకున్న అపర కుబేరులు ఆ మొత్తాన్ని వైట్‌గా మార్చుకునేందుకు పలు రకాల దందాలు చేస్తున్నారు. ఈ రకమైన దందాలు నిర్వహించే వాళ్ళకు స్వయంగా ఓ పక్క బ్యాంకు వాళ్ళే సపోర్టు చేస్తుంటే, మరో పక్క ముందుగానే వైట్ చేసుకున్న కొంత మంది నాయకుల అండదండలతో మెల్లిగా గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ అంతా వైట్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి అది బ్లాక్ గానే అలా మూలన గోదాములలోకి పోతుందనుకోండి. అలాంటప్పుడు నోట్ల కట్టలే మారుతున్నాయి. మళ్ళీ అంతా బ్లాక్ గానే రూపాంతరం చెందుతుందనే చెప్పాలి.  కాగా ఈ వ్యవహారాన్ని ఆశ్రయించుకొని దేశమంతటా పెద్ద దందాలు కొనసాగుతున్నాయి. నిత్యం ఎక్కడ చూసినా బ్లాక్ ను వైట్ గా చేసుకొనే ముచ్చట్లే తప్ప మరో వ్యవహారం వినిపించడం లేని పరిస్థితి భారత దేశంలో నెలకొంది. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల వాళ్ళు, బడా రాజకీయ నాయకులు వంటి నల్లకుబేరులు తమ వద్ద ఉన్న పాతనోట్లను వదిలించుకొని ఆ స్థానంలో కొత్త నోట్లను పేర్చుకొనే పనిలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. అందుకోసం మీడియా పావుగా వ్యవహరిస్తుంది. బ్లాక్ కు వైట్ కు మధ్య సమన్వయ కర్తలుగా రెండు మీడియా వర్గాలు నిరంతరం పోరాడుతున్నాయి. మరో పక్క ఆయా సంస్థల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు నెలజీతాల కింద ముందుగానే అడ్వాన్స్ రూపంలో పెద్ద నోట్లను పంపిణీ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది.  

కాగా ఇప్పటి చాలా కీలకమైన ఈ సమయంలో నల్లకుబేరుల వ్యూహాలను చిత్తు చేయాల్సిన నిఘా విభాగం కూడా వారికి వంతపలుకుతూ తగు రీతిలో ప్రవర్తిస్తుంది. ఇప్పటికే బడాబాబులు, సామాన్య ప్రజలు, బంగారు దుకాణాలను వదల్లేదు. బ్లాక్ కు వైట్ మధ్య ఓ పెద్ద దందానే నడుస్తుందని చెప్పాలి. దేశంలోని అందరి దృష్టి నల్లకుబేరులపై పడింది. నల్ల కుబేరులను ఆశ్రయించి వైట్ చేసుకొనే వారిని కలిపిస్తే దాంతో కాస్త పర్సెంటేజ్ పొందవచ్చని నిరంతరం మధ్యవర్తిత్వం నడిపే దళారీదారులు వారి చుట్టురా తిరుగుతూనే ఉన్నారు. ఇలా నడుస్తుందన్న మాట బ్లాక్ అండ్ వైట్ దందా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ