Advertisementt

అవికా ప్రయోగం భలే వర్కవుటయింది!

Sun 20th Nov 2016 04:56 PM
avika gor,ekkadiki pothavu chinnavada,nikhil,vi anand  అవికా ప్రయోగం భలే వర్కవుటయింది!
అవికా ప్రయోగం భలే వర్కవుటయింది!
Advertisement
Ads by CJ

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ ఎక్కడికిపోతావు... చిత్రం ప్రేక్షక అభిమానం చూరగొంది. ఈ సినిమాతో నిఖిల్ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా హెబ్బా పటేల్, నందిత శ్వేతలు నటించారు. ఇక్కడ  ట్విస్ట్  ఏమిటంటే ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో నిఖిల్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. కానీ చిత్ర యూనిట్.. సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్ మాత్రమే ట్రైలర్స్ లో, టీజర్స్ లో, చిత్ర  పోస్టర్స్ లో ప్రమోట్ చేస్తూ వచ్చింది. అందులో నటించిన మరో  హీరోయిన్ అవికా గోర్ ని ఎక్కడా ప్రమోట్  చెయ్యడం గాని అసలామె ఎక్కడికి పోతావు... లో ఉన్నట్టు గాని చూపించలేదు. అసలెందుకు దర్శకుడు అవికాని హైలెట్ చెయ్యకుండా దాచి పెట్టాడు. మరి సినిమాలో కూడా ఎక్కువ శాతం అవికాని బురఖాలోనే చూపించాడు దర్శకుడు. అయితే అసలీ అవికా పేరుని కూడా టైటిల్ లో అందరి పేర్ల కన్నా చివర్లోనే వేశారు. మరి ప్రమోషన్ కూడా అవికాపేరు వాడకుండా ఆమెతో ఒక్క ఇంటర్వ్యూ ఇప్పించకుండా అసలెందుకు అంత గుట్టుగా దాచినట్టు. 

అయితే దర్శకుడు విఐ ఆనంద్ మాత్రం అవికా కేరెక్టర్ ని దాచి పెట్టడం వల్ల సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేసాడు. అసలు ఇంకో హీరోయిన్ అవికా వుంటుందనే విషయం ప్రేక్షకుడికి సినిమా చూసే వరకు  కూడా తెలియకుండా దాచగలిగాడు దర్శకుడు. ఇక దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించి ఈ సినిమాకి కీలకమైన మలుపు తిప్పే పాత్రలో అవికా కనబడి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది . ఇక సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకాభిమానం చూరగొని హిట్ దిశగా సాగిపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ