Advertisementt

ఈ వయసులో త్రిష కోరిక తీరుతుంది..!

Sun 20th Nov 2016 03:57 PM
trisha,rajinikanth,dhanush,trisha acted movies,kodi  ఈ వయసులో త్రిష కోరిక తీరుతుంది..!
ఈ వయసులో త్రిష కోరిక తీరుతుంది..!
Advertisement
Ads by CJ

ముసలోడికి దసరా పండుగలా మారింది సీనియర్‌ హీరోయిన్‌ త్రిష పరిస్థితి. రెండేళ్ల కిందట ఆమె పరిస్దితి సందిగ్దంలో ఉండేది. సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ చెన్నై బ్యూటీ ఇక పెళ్లి చేసుకుందామనే నిర్ణయం కూడా తీసుకుందనే వార్తలు వచ్చాయి. కానీ అప్పటి నుంచే ఆమె దశ తిరిగింది. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సంచలన అవకాశాలు చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. లేటు వయసులో రెచ్చిపోతోంది. గత రెండేళ్లలో ఆమె తొమ్మిది చిత్రాలలో నటించింది. మరోపక్క కొత్త దర్శకులకు కూడా ఓకే చెబుతూ వస్తోంది. రెండేళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ఈమె ఈ ఏడాది కూడా బిజీగా మారింది. ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'కొడై' (ధర్మయోగి) చిత్రంలో రాజకీయనాయకురాలైన విలన్‌గా నటించింది. ఈ చిత్రం తమిళంలో పెద్దగా ఆడకపోయినప్పటికీ త్రిష క్యారెక్టర్‌కు మాత్రం జనం నీరాజనాలు పలికారు. ఇక వెటరన్‌ హీరో కమ్‌ తాజాగా విలన్‌గా మారిన అరవింద్‌ స్వామితో ఓ చిత్రం, కొత్త దర్శకునితో 'ఎన్‌హెచ్‌ 10'కు రీమేక్‌ అయిన 'గర్జనై' చిత్రాలలో నటిస్తోంది. ఇక సీనియర్‌, జూనియర్స్‌ అనే తేడా లేకుండా కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో దాదాపు అందరూ స్టార్స్‌ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు ఓ తీరని కోరిక ఉంది. ఇప్పటివరకు ఆమె సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రంలో నటించలేదు. త్వరలో ఆమెకు ఆ కోరిక కూడా తీరనుంది. 'కబాలి' ఫేమ్‌ రంజిత్‌పా దర్శకత్వంలో రజనీ అల్లుడు, స్టార్‌హీరో ధనుష్‌ నిర్మాతగా రజనీకాంత్‌ హీరోగా నిర్మితం కానున్న చిత్రానికి కూడా ఆమెను ఓ కీలకపాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. 'ధర్మయోగి' చిత్రంలో ఆమె నటనకు ముగ్దుడైన ధనుష్‌ ఈ చిత్రంలోని ఓ పాత్రకు త్రిషను ఎంచుకున్నాడట. ఈ పాత్ర సినిమాకే కీలకంగా ఉంటుందట. మొత్తానికి త్రిష ప్రస్తుతం పెళ్లి మాటను మర్చిపోయి వరస చిత్రాలతో దూసుకుపోతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ