Advertisementt

రాశి ఖన్నా కహానీలు స్టార్ట్ చేసింది..!

Sun 20th Nov 2016 03:46 PM
rashi khanna,kahani,rashi khanna about movies,heroine rashi khanna  రాశి ఖన్నా కహానీలు స్టార్ట్ చేసింది..!
రాశి ఖన్నా కహానీలు స్టార్ట్ చేసింది..!
Advertisement
Ads by CJ

రాశి ఖన్నా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొంత కాలమే అయ్యింది. వచ్చినప్పటినుండి ఒకమాదిరి హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ పోతున్న రాశికి  పెద్దహీరోల పక్కన మాత్రం ఇప్పటివరకు నటించే ఛాన్స్ దొరకలేదు. ఒక సినిమాలో లావు ఎక్కువైందని.... మరో సినిమాలో స్లిమ్ గా కనిపించినా కూడా ఆమెకు అనుకున్నంత ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఇక ఆ మధ్యన బొద్దుగా వున్నానని ఆఫర్స్ రావడం లేదేమో అని బాగా సన్నగా స్లిమ్ గా కూడా తయారైంది. ఇక తాజాగా రాశి, రామ్ చరణ్ పక్కన సెలెక్ట్ అయ్యిందని వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే వార్తలైతే ప్రచారం జరిగాయి కానీ ఎక్కడా అధికారికంగా చరణ్ పక్కన రాశి నటిస్తుందని చెప్పలేదు. 

అదలా ఉంటే ఇప్పుడు రాశి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే రాశి ఖన్నా ఏకంగా టాలీవుడ్ లో 70  సినిమాల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వదులుకుందట. ఆమ్మో 70  సినిమాల్లో రాశి ఖన్నాకి అవకాశాలా...! అని నోరెళ్లబెట్టకండి. ఈ విషయం స్వయం గా రాశి ఖన్నానే చెప్పింది. గత రెండున్నర సంవత్సరాలుగా తన దగ్గరకు వచ్చిన అవకాశాలను కథ నచ్చక పోవడం వల్ల, ఇంకా తన కేరెక్టర్ కి ఇంపార్టెన్స్  లేక పోవడం వల్ల తాను వదులుకోవాల్సి వచ్చిందని కహానీలు వినిపిస్తుంది. అసలు హీరోయిన్ గా అవకాశాలే రావడం కష్టంగా వున్న ఈ రోజుల్లో మరీ ఇన్ని అవకాశాలు ఎవరైనా చేజార్చుకుంటారా ....! విచిత్రంగా లేదు రాశి ఖన్నా చెప్పే ఈ మాటలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ