Advertisementt

కొడుక్కి హిట్టిచ్చాడు..నాగ్ ఛాన్సిచ్చాడు..!

Sat 19th Nov 2016 09:10 PM
nagarjuna,premam,chandoo mondeti,chandoo mondeti directs nagarjuna,police story for nag  కొడుక్కి హిట్టిచ్చాడు..నాగ్ ఛాన్సిచ్చాడు..!
కొడుక్కి హిట్టిచ్చాడు..నాగ్ ఛాన్సిచ్చాడు..!
Advertisement
Ads by CJ

మొదటి నుంచి కొత్త, యువ దర్శకులను ఎంకరేజ్‌ చేయడంలో నాగార్జున ముందుంటాడు. వర్మనే కాదు.. లారెన్స్‌ నుండి వీరభద్రమ్‌చౌదరి, శ్రీనివాసరెడ్డి, విక్రమ్‌ కె.కుమార్‌, కళ్యాణ్‌కృష్ణ వరకు ఎందరికో ఆయన అవకాశం ఇచ్చారు. అంతేకాదు... అందులో కొన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా ఎక్కువ సార్లు ఆయన నిర్ణయాలు సరైనవే అని నిరూపించుకున్నాయి. ఇక ప్రస్తుతం సీనియర్‌స్టార్‌గా మారడంతో తన వయసుకు తగ్గ వెరైటీ క్యారెక్టర్లను చేస్తున్నాడు. తన కొడుకులిద్దరు నాగచైతన్య, అఖిల్‌లు కూడా హీరోలుగా మారడంతో వారి కెరీర్‌ను చక్కదిద్దేపనిలో కూడా నాగ్‌ బిజీ అయిపోయాడు. వారి కోసం వెతికే న్యూటాలెంట్‌ దర్శకులు తమను తాము నిరూపించుకుంటే తాను కూడా అవకాశం ఇస్తూ, తాను పరిచయం చేసిన, అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌కృష్ణ, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి వారితో తన కొడుకులకు తగ్గ స్క్రిప్ట్‌లను తయారు చేయిస్తూ నేడు న్యూటాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. వీటిలో ఎక్కువ చిత్రాలను తానే నిర్మిస్తున్నాడే తప్ప ఇతర నిర్మాతలను ఇబ్బందిపెట్టడం లేదు. 

కాగా నాగార్జున పెద్దకుమారుడైన నాగచైతన్యతో ఇటీవల మలయాళ రీమేక్‌ 'ప్రేమమ్‌' వంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలిచి, చైతూకు హిట్‌ ఇచ్చిన యువ దర్శకుడు చందు మొండేటి తన అభిమాన హీరో అయిన నాగ్‌ కోసం ఓ వెరైటీ పాత్రను సృష్టించి, దానికి తగ్గ పక్కా స్క్రిప్ట్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడని, ఇటీవల ఆయన ఆ చిత్రం లైన్‌ను నాగ్‌కు కూడా చెప్పాడని, త్వరలో నాగ్‌ తన సొంతబేనర్‌లోనే ఈ చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. తాను చేసే చిత్రాలలోని క్యారెక్టర్లన్నింటినీ వెరైటీగా ఉండేట్లు చూసుకుంటున్న నాగ్‌ ప్రస్తుతం మరోసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరోసారి వేంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన హథీరాంబాబాగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌కు రెండో మూవీగా రూపొందనున్న ఓ వెరైటీ ప్రేమకథాచిత్రాన్ని కూడా తానే నిర్మించాలని డిసైడ్‌ అయ్యాడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

కాగా నాగ్‌ త్వరలో 'రాజు గారి గది' చిత్రం సీక్వెల్‌లో నటిస్తున్నాడని, ఈ చిత్రం ద్వారా ఆయన కొత్తగా దర్శకునిగా మారిన యాంకర్‌ ఓంకార్‌కు అవకాశం ఇవ్వనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక చందు మొండేటి విషయానికి వస్తే టాలీవుడ్‌ హీరోలు ఎంతో ఇష్టంగా భావించే పోలీస్‌ స్టోరీని చందు మొండేటి నాగ్‌కు చెప్పాడట. పూరీ దర్శకత్వంలో చేసిన 'శివమణి'లో అద్బుతమైన నటనను కనపర్చిన నాగ్‌ను చందుమొండేటి మరో డిఫరెంట్‌ పోలీస్‌ క్యారెక్టర్‌లో చూపించడానికిి హామీ పొందాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇక ఈ చిత్రం విషయాలు త్వరలో అధికారికంగా తెలిసే అవకాశం ఉందంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ