టాలీవుడ్ యంగ్ హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుని అటు సినిమాల్లోనూ ఇటు నిజ జీవితంలోను సెటిల్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక అర్జున్, ఎన్టీఆర్ లకైతే పిల్లలు కూడా పుట్టేసారు. అటు తర్వాత నాని, నరేష్ వంటి హీరోలు కూడా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక నరేష్ కి కూడా ఒక పాప పుట్టింది. ఇక నాని 2012లో విశాఖపట్నానికి చెందిన అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఇప్పుడు తాజాగా నాని తండ్రి కాబోతున్నాడని సమాచారం. నాని వైఫ్ అంజనా ప్రస్తుతానికి గర్భవతి అట. ఇక మూడు, నాలుగు నెలల్లో అంజనా ఒక బిడ్డకి జన్మనివ్వబోతోంది చెబుతున్నారు. నాని తన కెరీర్ లో హిట్ సినిమాలతో దూసుకుపోతూ అదృష్టాన్ని ఈ మధ్యన వెంటపెట్టుకుని తిరుగుతున్నాడు. నాని కి ఈ తండ్రి అయ్యే శుభవార్త కూడా లైఫ్ లో ఎంతటి తీపి కబురో కదా...!