Advertisementt

షాకింగ్ గాసిప్: ఎన్టీఆర్, బన్నీ మల్టీస్టారర్!

Sat 19th Nov 2016 03:18 PM
allu arjun,bunny,jr ntr,puri jagannadh,allu arjun with jr ntr,multi starer  షాకింగ్ గాసిప్: ఎన్టీఆర్, బన్నీ మల్టీస్టారర్!
షాకింగ్ గాసిప్: ఎన్టీఆర్, బన్నీ మల్టీస్టారర్!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన తెలుగులో ఏవో క్రేజీ కాంబినేషన్స్ తెరకెక్కుతాయని తెగ ప్రచారాలు మొదలెట్టారు. అసలు ఆ పేర్లు తెర మీదకొస్తేనే వాటికి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. మరి అలాంటి మల్టి స్టారర్ మూవీస్ గనక అధికారికంగా మొదలు పెడితే ఆసినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహకు కూడా అందవు. నిన్నటికి నిన్న బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ తెరకెక్కుతోందని ప్రచారం చేసారు. అది పక్కాగా అధికార ప్రకటన వెలువడలేదు. ఇక ఆ కాంబినేషన్ అలా ఉంటే మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ కలిసి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నారని అంటున్నారు. 

ఇప్పటికే పూరీ.. అల్లు అర్జున్ కి, ఎన్టీఆర్ కి కథ వినిపించి ఒప్పించగా.... వారిద్దరూ ఈ సినిమా చెయ్యడానికి సుముఖం గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక నిర్మాత దొరకడమే ఆలస్యం గా చెబుతున్నారు. మరి ఈ సినిమాని నిర్మించే భారీ నిర్మాత ఎవరో గాని నందమూరి హీరో - మెగా హీరో కలిసి నటించే సినిమాని నిర్మించడం మామూలు విషయం కాదు. అయితే నిర్మాత ఫైనల్ కాగానే ఈ సినిమా సెట్స్ మీదకెళ్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రచనా కార్యక్రమాన్ని కోన వెంకట్, బివిఎస్ రవిలకు అప్పజెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

మరి అన్ని రూమర్స్ లాగా ఇది కూడా రూమరేనా లేక నిజంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందా? అనేది మాత్రం కొద్దీ రోజులు వేచి చూడక తప్పేలా లేదు. ఇక ఈ సినిమాతో పూరి కూడా తన మీద ప్లాప్ డైరెక్టర్ ముద్రని చెరిపేసుకుని భారీ విజయాన్ని మూటగట్టుకోవాలని భావిస్తున్నాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ