Advertisementt

చిన్నోడి టాక్ ఓకే..మరి మోడీ ఏం చేస్తాడో..?

Sat 19th Nov 2016 02:23 PM
ekkadiki pothavu chinnavada movie,nikhil,modi,notes ban  చిన్నోడి టాక్ ఓకే..మరి మోడీ ఏం చేస్తాడో..?
చిన్నోడి టాక్ ఓకే..మరి మోడీ ఏం చేస్తాడో..?
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనని అస్సలు లెక్క చెయ్యకుండా 'సాహసం శ్వాసగా సాగిపో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఇక వచ్చినప్పటినుండి పెద్ద నోట్ల రద్దు సెగ తగిలి బోర్లా పడ్డాడు. అందులోనూ సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఇక ఆ సినిమా కలెక్షన్స్ పై ఆశలొదిలేసుకుని సైలెంట్ గా కూర్చున్నాడు. చైతన్యలాగే ఇప్పుడు మరో కుర్ర హీరో కూడా మోడీ ప్రకటనకు ఏ మాత్రం భయపడకుండా థియేటర్లో సందడి చేసేస్తున్నాడు. అతనే 'హ్యాపీడేస్' చిత్రంతో వన్ ఆఫ్ ద  హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తర్వాత సోలో హీరోగా నిలదొక్కుకున్న నిఖిల్. నిఖిల్ సోలో హీరోగా చేస్తున్నప్పుడు కొని సినిమాలు ప్లాప్ అయినా కూడా.... సినిమాలు వదలకుండా చేస్తూనే వున్నాడు. అయితే నిఖిల్ ఎప్పుడైతే వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ వెంట పడ్డాడో అప్పుడే అతని సినిమాలన్నీ హిట్ అవ్వడం మొదలెట్టాయి. ఇక అప్పటి నుండి హీరోగా నిలదొక్కుకుంటూ విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మోడీ పెద్ద నోట్ల ప్రకటనకు ఏ మాత్రం భయపడకుండా తన చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తో థియేటర్లు లోకి వచ్చాడు. ఇక విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దుసుకుపోతూ హిట్ టాక్ కొట్టేసాడు. అంతేకాదు నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా ఈ 'ఎక్కడికి పోతావు..' నిలిచిపోతుందని అంటున్నారు. అలాగే వెబ్సైట్లు కూడా నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' కి మంచి రివ్యూ రేటింగ్స్ ఇచ్చేసారు. మరి నోట్ల రద్దు ప్రభావం లేకుండా ఈ చిత్రం ఈ వారమంతా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోందని ఆశిద్దాం. 

Click Here to Ekkadiki Pothadu Chinnavada English Review

Click Here to Ekkadiki Pothadu Chinnavada Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ