Advertisement

కార్తీ కరెక్ట్ దారిలో వున్నాడు..!

Sat 19th Nov 2016 12:39 PM
karthi,kaashmora,oopiri,karthi telugu films,karthi decision on movies  కార్తీ కరెక్ట్ దారిలో వున్నాడు..!
కార్తీ కరెక్ట్ దారిలో వున్నాడు..!
Advertisement

క్రియేటివ్‌ జీనియస్‌గా చెప్పుకునే దర్శకరత్నం మణిరత్నం ప్రస్తుతం కార్తీ హీరోగా 'డ్యూయెట్‌' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంపై కార్తీ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. 'ఓకే బంగారం'తో మణి మరలా నేటి ట్రెండ్‌ను ఫాలోఅవుతూ, ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో కార్తి.. మణి చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడు. తన గురువు మణి తనకు మరిచిపోలేని హిట్‌ను ఇస్తాడని, తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు రైట్స్‌ తీసుకోవడంతో తెలుగులో మణిరత్నంపై దిల్‌రాజుపై ఆశలు పెంచుకుంటున్నాడు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇక తమిళంలో కార్తీ 'మద్రాస్‌, కొలంబస్‌' చిత్రాలతో మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఇక తెలుగులో కూడా ఆయన నటించిన 'ఊపిరి; కాష్మోరా' చిత్రాలు బాగానే ఆడాయి. దీంతో ఆయన 'ఊపిరి, కాష్మోరా' చిత్రాల తర్వాత మణిరత్నం 'డ్యూయెట్‌' చిత్రంతో తెలుగులో తొలి హ్యాట్రిక్‌ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. ఇక తమిళంలో ఆయన ఇప్పటికే వరసగా నాలుగు హిట్‌లు ఇచ్చాడు. 'మద్రాస్‌, కొలంబస్‌, ఊపిరి, కాష్మోరా'లతో విజయాలు సాధించిన కార్తీ.. మణిరత్నం చిత్రం ఆయనకు వరసగా తమిళంలో ఐదవ హిట్‌ను ఇస్తుందని, అదే జరిగితే ఆయన డబుల్‌ హ్యాట్రిక్‌కు కేవలం ఒక్క చిత్రం దూరంలో నిలుస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు. 

ఇక తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉన్న కార్తీ టాలీవుడ్‌ను కూడా ఎంతో సీరియస్‌గా తీసుకుంటున్నాడు. సాధారణంగా ఒక పరభాషా హీరో చిత్రం హిట్టయి, పరభాషలో క్రేజ్‌ వస్తే ఇక వారి చిత్రాలన్నింటిని డబ్బింగ్‌లు చేస్తుంటారు. కానీ ఈ విషయంలో కార్తి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ, తన క్రేజ్‌ను పెంచే చిత్రాలను మాత్రమే టాలీవుడ్‌లో రిలీజ్‌ చేయాలని, అంతేగానీ ప్రతి చిత్రాన్ని డబ్బింగ్‌ చేయకూడదని నిర్ణయించుకొని, ఆ మేరకు తనతో చిత్రాలు తీసే దర్శకనిర్మాతలకు ముందుగానే షరత్తులు విధిస్తూ, తెలుగులో తన తమిళ చిత్రం డబ్బింగ్‌ విషయంలో పలు ఆంక్షలు విధిస్తున్నాడు. ఆయన నటించిన 'మద్రాస్‌, కొలంబస్‌'చిత్రాలు పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, వారి అభిరుచి మేరకు, తమిళ నేటివిటీతో తీసిన చిత్రాలుకావడంతో ఈ చిత్రాలు తమిళంలో ఘనవిజయం సాధించినా వాటిని తెలుగులోకి డబ్‌ చేయలేదు. ఎందరో తెలుగు డబ్బింగ్‌ చిత్రాల నిర్మాతలు పోటీ పడినప్పటికీ ఆయన ఆ రెండు చిత్రాలను టాలీవుడ్‌లో డబ్‌ చేయడానికి అంగీకరించలేదు. దీన్ని బట్టి టాలీవుడ్‌ను కార్తి ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో అర్దం అవుతుంది. ఈ విషయంలో ఆయన తన సోదరుడు సూర్య కంటే ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడంటున్నారు. మరి తెలుగులో మార్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్న పరభాషా హీరోలు ఈ విషయంలో కార్తీని ఆదర్శంగా తీసుకోవాలని, తాము నటించిన చిత్రం ఎలా ఉన్నా, తెలుగులో కూడా విడుదల చేసి, సాధ్యమైనంతగా బిజినెస్‌ చేసుకొని లాభపడాలని భావించకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు కార్తీ ముందుచూపును, జాగ్రత్తలను ప్రశంసిస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement