మన స్టార్‌హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇటీవల రామ్‌చరణ్‌లతో పాటు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారు కూడా బాలీవుడ్‌కి వెళ్లి దెబ్బతిని, ఏదో తమ చిత్రాలను అప్పుడప్పుడు డబ్బింగ్‌లు చేస్తూ వస్తున్నారు. ఇక దక్షిణాది టాప్‌హీరోయిన్లు కూడా సౌత్‌లో టాప్ పొజిషన్‌కు రాగానే బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ ఆదరణ లేక, అవకాశాలు రాక.. రెంటికి చెడ్డరేవడిలా మారి మరలా సౌత్‌కు వచ్చేందుకు సిద్దపడుతున్నారు. శ్రీదేవి, జయప్రద, ఎఆర్‌రెహ్మాన్ వంటి కొందరు మాత్రమే దానికి మినహాయింపుగా చెప్పుకోవాలి. కాగా రాజమౌళి తీసిన 'బాహుబలి పార్ట్1' అన్ని వుడ్‌లతో పాటు బాలీవుడ్‌లో కూడా సంచలన విజయం సాధించింది. దాంతో రాజమౌళితో పాటు ఆ చిత్ర నిర్మాతలు కూడా తమ చిత్రం సెకండ్ పార్ట్‌ను ఎక్కువగా బాలీవుడ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. 'బాహుబలి2' టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో పాటు బాలీవుడ్‌లో కరణ్‌జోహార్ అండతో భారీగా ఆడియో రిలీజ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను భారీ ఖర్చుతో ముంబైలో చేస్తున్నారు. ఇక తెలుగులో మాత్రం ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రమోషన్ అవసరం లేదని, ఇక్కడ ఏదో తూ.. తూ.... మంత్రంగా తెలుగువెర్షన్ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తున్నారు. తనకు, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, ఆల్‌రెడీ ఈ చిత్రం మొదటి పార్ట్ టాలీవుడ్‌లో సాధించిన వసూళ్లు చూసి, ఇక తెలుగులో ప్రమోషన్ అవసరం లేదనే భ్రమలో రాజమౌళి ఉన్నాడు.
ఇక 'రోబో, ఐ' వంటి తన చిత్రాలన్నింటినీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తున్న శంకర్ సైతం తన తాజా చిత్రం 'రోబో2' ఫస్ట్‌లుక్‌ను కూడా ముంబైలోని ప్రముఖ స్టూడియోలో కరణ్‌జోహార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్నాడు. ఈ ఒక్క ఫంక్షన్‌కు ఆయన ఏకంగా 6కోట్లు ఖర్చుపెడుతున్నాడు. ఇప్పటివరకు తాను తీసిన చిత్రాలన్నింటి వేడుకలు తమిళ, తెలుగు భాషల్లో భారీగానే ప్రమోషన్ చేసి, హిందీ వెర్షన్ కంటే తమిళ, తెలుగు వెర్షన్‌ల ప్రమోషన్‌ను ఘనంగా నిర్వహించి విజయం సాధిస్తూ వస్తున్నాడు. ఇంతకాలం శంకర్ కూడా బాలీవుడ్‌ను అదనపు ఆదాయ వనరుగా చూశాడే కానీ దాన్నే నమ్ముకోలేదు. కానీ 'రోబో2' చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ను తీసుకొని సంచలనం సృష్టించిన శంకర్‌కు తన ఇమేజ్‌తో పాటు రజనీకి ఆల్‌రెడీ తమిళ, తెలుగు భాషల్లో ఉన్న క్రేజ్ చాలని, ఈ చిత్రానికి బాలీవుడ్‌లో అక్షయ్‌కుమారే నిలబెడతాడని భావిస్తున్నాడు. తనకు రజనీ ఇమేజ్ కంటే అక్షయ్ ఇమేజే ఎక్కువ లాభదాయమనే ఆలోచనలో ఉన్నాడు.
కానీ విశ్లేషకులు మాత్రం కేవలం బాలీవుడ్‌పైనే రాజమౌళి, శంకర్‌లు ఆధారపడటం తప్పని, అది ఎప్పటికైనా ముప్పేనని భావిస్తున్నారు. ఇక బాహుబలి పార్ట్1, పార్ట్2లతో తనకు వచ్చిన, రాబోయే భారీ క్రేజ్‌ను చూసి ప్రభాస్ సైతం తన తదుపరి చిత్రాలను హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాడు. 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో పవన్ భ్రమలు తొలగిపోయాయి. ఇక ప్రభాస్, మహేష్‌ల వంతు మాత్రమే మిగిలివుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.