Advertisementt

పనోళ్ళు సంతోషపడేంతలోనే....!

Thu 17th Nov 2016 06:19 PM
black money,star heroes,heroines,big business mans  పనోళ్ళు సంతోషపడేంతలోనే....!
పనోళ్ళు సంతోషపడేంతలోనే....!
Advertisement
Ads by CJ

మోడీ పెద్ద నోట్ల దెబ్బకి బడా నాయకులూ, బడా హీరో, హీరోయిన్స్, బడా వ్యాపారవేత్తలు గిల గిలా కొట్టుకు చస్తున్నారు. సామాన్యుడేమో చేతిలో డబ్బుల్లేక కొట్టుకుంటుంటే వీరికి పెద్ద నోట్లు ఎక్కువై కొట్టుకుంటున్నారు. మోడీ దెబ్బ ములుగా పడలేదు. గత వారం రోజుల నుండి నల్లకుబేరుల ఏం చెయ్యాలో పాలుపోక, కంటి నిండా నిద్ర కరువై కొట్టుకుంటున్నారు. ఇప్పటికే సినిమా పరిశ్రమ పెద్ద నోట్ల రద్దుతో కుదేలైపోయింది. ఏదో మోడీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు గాని లోలోపల తెగ బాధ పడిపోతున్నారు బడా హీరోలు. ఇక కొంతమంది హీరోలైతే ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటే మరి కొంతమంది తమదగ్గరున్న సొమ్ముని పని వాళ్లకి (తమ ఇంట్లో పనిచేసే అందరికి... చాకలి, తోటపని,ఇంటిపని, వాచ్ మ్యాన్) ఇచ్చేస్తున్నారు.

ఆ సినీప్రముఖులు పని వాళ్లకి డబ్బులిచ్చి పండగ చేసుకోమని చెప్పి ఆ తర్వాత మాత్రం షాక్ ఇస్తున్నారని అంటున్నారు. ముందేమో రెండున్నర లక్షలు మీ అకౌంట్ లో వేసుకుని పండగ చేసుకోమని తర్వాతి రోజు ఆ డబ్బు మీకు ఒక సంవత్సర జీతం గా ముందే ఇచ్చేశాం అని చావు కబురు చల్లగా చెబుతున్నారట. అంతేకాదు మీకు ఒక సంవత్సర జీతం ఒకేసారి ఇచ్చేశాం గనక మాకు మీరు చాలా సిన్సియర్ గా పని చెయ్యాలని అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒకటే గుసగుసలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ