Advertisementt

చిరు రఫ్ఫాడించేశాడంట..!

Wed 16th Nov 2016 07:10 PM
chiranjeevi,khaidi no 150,kajal agarwal,chiranjeevi dance steps,vv vinayak  చిరు రఫ్ఫాడించేశాడంట..!
చిరు రఫ్ఫాడించేశాడంట..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150...  డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాణ సారధ్యం లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని బ్యాలెన్స్ సాంగ్స్ ని షూట్ చేసుకుంటున్న ఈ చిత్రం పై ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా లేట్ వయసులో మొదలు పెట్టాడు. 60  ఏళ్ళ వయసులో చిరు మళ్ళీ మొహానికి రంగేసుకుని ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక చిరంజీవి గత చిత్రాలలో డాన్స్ లకు పెట్టింది పేరు. అయితే ఈ వయసులో చిరు భారీ స్టెప్స్ ని వెయ్యలేడేమో అనుకుని డైరెక్టర్ వి.వి.వినాయక్ డాన్స్ మాస్టర్స్ కి కొద్దిపాటి తేలిక స్టెప్స్ నే చిరుకి నేర్పమని చెప్పాడట. కానీ చిరంజీవి మాత్రం మీరెలాంటి కఠినమైన స్టెప్స్ ఇచ్చినా నేను చెయ్యడానికి సిద్ధమని చెప్పాడట. ఇక చిరు చెప్పినట్లుగానే డాన్స్ లో చాలా కష్టమైనా స్టెప్స్ తో డాన్స్ ఇరగదీసేశాడని, రఫ్ఫాడించేశాడని సమాచారం. ఇక ఈ డాన్స్ చూసి డైరెక్టర్ వి.వి వినాయక్ కూడా అవాక్కయ్యాడని అంటున్నారు. అలాగే కుర్ర హీరోయిన్ కాజల్ కూడా చిరు తో డాన్స్ ఇరగదీసిందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ