రచయితగా పూర్తి సంతృప్తి చెందని కొరటాల శివ ఆ తర్వాత తానే దర్శకునిగా మారి ప్రభాస్‌కు, మహేష్‌బాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు బ్లాక్‌బస్టర్లను అందించాడు. ఆయా హీరోలకు ఆయన తమ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిపెట్టించాడు. కాగా ప్రస్తుతం ఆయన దానయ్య నిర్మాతగా మహేష్‌బాబును రెండోసారి డైరెక్ట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కేవలం మూడే మూడు చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి, ఎక్కువ రెమ్యూనరేషన్స్ తీసుకునే దర్శకుల లిస్ట్‌లో చోటు సంపాదించాడు. ఇక మహేష్ రెండో చిత్రానికి ఆయన రికార్డ్ స్దాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా 'మిర్చి'తో దర్శకునిగా మారి అప్పటివరకు ప్రభాస్ నటించిన చిత్రాలలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా దానిని నిలిపి ప్రభాస్ రేంజ్‌ను పెంచాడు. ఇక 'మిర్చి' తర్వాత ఆయన రామ్‌చరణ్‌తో ఓ చిత్రం ప్రారంభించాడు. కానీ సెకండ్ సినిమా బ్యాడ్ సెంటిమెంట్‌కు భయపడి, కథ నచ్చలేదని కూడా భావించిన రామ్‌చరణ్ ముహూర్తం కూడా జరుపుకున్న ఈ చిత్రాన్ని అర్దాంతరంగా ఆపేశాడు. ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సైతం కొరటాల శివతో సినిమా చేస్తానని చెప్పి, స్టోరీ నచ్చలేదనే ఒకే ఒక్క మాటతో ఆయనకు చాన్స్ ఇవ్వడానికి భయపడి సినిమాను పక్కనపెట్డాడు. ఇక ఆయనతో సినిమా చేయడానికి మహేష్‌బాబు ముందుకు వచ్చి సందేశాత్మక చిత్రాలను కూడా కమర్షియల్‌గా తెరకెక్కించి..రికార్డులు బద్దలుకొట్టే చిత్రాలుగా తీయగలడనే నమ్మకంతో మంచి సందేశం ఉన్న 'శ్రీమంతుడు' అవకాశం ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న కొరటాల శివ మంచి సందేశాత్మక చిత్రంగా 'శ్రీమంతుడు' నడిపించి, సందేశాత్మక చిత్రాలను కూడా జనరంజకంగా తీయడం ఎలాగో చూపించాడు. ఈ చిత్రం నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. కొరటాల శివపై ఇంతటి నమ్మకం చూపించిన మహేష్ నుండి ఆయన రెండో ఛాన్స్‌ను కూడా సాధించి మహేష్‌పై తనకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని నిజం చేస్తున్నాడు.
శ్రీమంతుడు హిట్‌ను చూసిన ఎన్టీఆర్‌కు అప్పటికీ గానీ కొరటాల శివ సత్తా ఏమిటో అర్ధం కాలేదు. ఈ చిత్రం విడుదలైనప్పుడు ఆయన సుకుమార్‌తో 'నాన్నకు ప్రేమతో' చిత్రం కోసం లండన్‌లో ఉన్నాడు. ఆలస్యమైతే కొరటాల తన మూడో సినిమాను ఎవరితోనైనా కమిట్ అవుతాడనే భయంతో స్వయంగా ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్ నుండి అర్దాంతరంగా హైదరాబాద్ చేరుకొని కొరటాల శివ వద్దకు వెళ్లి 'జనతా గ్యారేజ్' స్టోరీకి ఓకే చెప్పాడు. ఈ విషయం అప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇలా తాను వద్దన్న దర్శకుని వద్దకే వెళ్లి మీతో సినిమాను చేస్తామని పట్టుబట్టి వారిని తన వద్దకే వచ్చేలా చేయడం కొరటాలకే చెల్లింది. తనను కాదన్న స్టార్‌హీరోను తన కాళ్ల దగ్గరకే రప్పించుకున్న ఘనత, ఆ చిత్రాన్ని సరైన ఫామ్‌లో లేని ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచేలా చేసి తన సత్తా చూపించాడు కొరటాల. ఇప్పుడు తనకు నో చెప్పిన మరో స్టార్ రామ్‌చరణ్ కూడా తాను సుకుమార్‌తో చిత్రం చేసేలోపు కొరటాల మహేష్ చిత్రం పూర్తవుతుంది కాబట్టి ఆయన దర్శకత్వంలో ఆ వెంటనే తాను చిత్రం చేస్తానని ముందుకు వచ్చేలా చరణ్ దించగలిగాడు. ఇక కొరటాల.. చిరు 150వ చిత్రానికి మంచి కథను చెప్పి చిరంజీవిని మెప్పించినప్పటికీ ఎక్కువ సినిమాలు తీయలేదని, తనను హ్యాండిల్ చేయగలడా? అని సందేహించాడు మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ కూడా ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో నటించేందుకు సై అనే సంకేతాలు పంపడమే కాదు.. తన కుమారుడు చరణ్‌పై కొరటాల శివ దర్శకత్వంలో అర్జెంట్‌గా ఓ చిత్రం చేయమని ఒప్పించి, చరణ్ ద్వారానే కొరటాలకు సందేశాలు పంపేలా చేశాడు. ఇక తన కుమారుడితో హిట్ ఇస్తే కొరటాల శివ తో చిత్రాన్ని చరణ్ స్దాపించిన కొణిదల బేనర్‌లోగానీ, ప్రతి చిత్రాన్ని కాలిక్యులేటెడ్‌గా నిర్మించే అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బేనర్‌లో గానీ చిత్రం చేయాలనే యోచనలో చిరు ఉన్నాడు. అంతేకాదు.... కొరటాల చరణ్ విషయంలో తన నమ్మకాన్ని నిలబెడితే ఎవ్వరూ ఇవ్వనంత రెమ్యూనరేషన్‌ను చరణ్ ద్వారా, లేదా అల్లు అరవింద్ చేతనైనా ఇప్పించాలనే యోచనలో మెగాస్టార్ ఉన్నాడు. ఇలా తనను వివిధ కారణాలతో నో అన్న వారి చేతే తమతో ఓ చిత్రం చేయాలని అడిగేలా చేసి కొరటాల వీడు మగాడ్రా బుజ్జి అని నిరూపించుకున్నాడు. ఇక కొరటాల శివ పవన్‌తో సైతం ఓ చిత్రం చేయాలని, ఆయన దగ్గర పవన్‌కి సూట్ అయ్యే ఓ మంచి కథ ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కొరటాలనే తనకు ఛాన్స్ ఇప్పించమని సంకేతాలు ఇచ్చింది కేవలం ఇద్దరికే అని అది మహేష్‌కు, పవన్‌కు మాత్రమే అని తెలుస్తోంది. ఏది ఏమైనా డైరెక్టర్ అంటే కొరటాల శివలా ఉండాలనేది అందరి నోటిలో నుండి వినిపిస్తున్న మాట.