Advertisementt

కోరమీసంతో కత్తిలా వున్నాడు..!

Tue 15th Nov 2016 07:59 PM
jr ntr,talasani srinivas yadav daughter wedding,jr ntr new look,jr ntr new movie look  కోరమీసంతో కత్తిలా వున్నాడు..!
కోరమీసంతో కత్తిలా వున్నాడు..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ గత మూడు సినిమాల నుండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. 'టెంపర్' లో ఫిట్ బాడీ తో కనబడిన ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రం లో గెడ్డం బాగా పెంచి ఒక స్టైల్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఇక 'జనతా గ్యారేజ్' లో మాత్రం సదా సీదా కామన్ మ్యాన్ లా నటించాడు. 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టలేదు. అయితే ఏ దర్శకుడితో చేస్తే బావుంటుంది అనే దీర్ఘాలోచనలో ఎన్టీఆర్ కనబడుతున్నాడు. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడా..  అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తున్నాడా అని కూడా ఫ్యాన్స్ లో ఒకటే టెంక్షన్. ఇక ఎన్టీఆర్ మాత్రం ఎలా  కనబడినా.... చూసిన వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రం కోసమే ఈ లుక్ లో కనబడుతున్నాడని ప్రచారం చేసేస్తున్నారు.

ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి  వివాహ వేడుకలో ఒక కొత్త లుక్ తో కనబడ్డాడు. కోరమీసంతో కత్తిలా, డిఫరెంట్ గా కనిపించాడు ఎన్టీఆర్. ఈ మీసంతో ఎన్టీఆర్ ఒక పోలీస్ పాత్ర చేస్తున్నాడా... అన్నట్టు ఉందా గెటప్. మరి నిజంగా ఎన్టీఆర్ తన  నెక్స్ట్ సినిమా కోసమే ఈ గెటప్ లో ఉన్నాడా... లేక మాములుగా వున్నా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమే ఇలా అని ప్రచారం జరుగుతుందా.... అనేది మాత్రం ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా మొదలైతే గాని క్లారిటీ రాదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ