Advertisementt

ఆ షో కి హ్యాండ్ ఇచ్చిన అనసూయ..!

Tue 15th Nov 2016 07:34 PM
anasuya bharadwaj,anchor anasuya bharadwaj,item song  ఆ షో కి హ్యాండ్ ఇచ్చిన అనసూయ..!
ఆ షో కి హ్యాండ్ ఇచ్చిన అనసూయ..!
Advertisement
Ads by CJ

అనసూయ ఈ మధ్యన ఎక్కువగా వెండితెర మీద ఫోకస్ పెట్టి బుల్లితెర ని నెగ్లెట్ చేస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏదో జబర్దస్త్ బాగా పేరు తీసుకొచ్చింది కాబట్టి దానిని విడవకుండా మిగతా వాటిని వదిలేస్తుందట. అసలే ఇప్పుడు ఐటెం సాంగ్ లో కూడా నటిస్తోంది. ఇక బుల్లితెర పెద్దగా ఏం నచ్చుతుంది అనసూయకి. అందుకే ఆమె ఇలా బుల్లితెరని నిర్లక్ష్యం చేస్తుందని అంటున్నారు. అసలు అనసూయ హాట్ యాంకర్ గా బుల్లితెర మీద దూసుకుపోతుంది. మిగతా యాంకర్స్ కి గట్టి పోటీ ఇస్తూ బుల్లితెరని ఏలుతుంది. అలాగే మరో పక్క వెండితెర మీద కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే సోగ్గాడే... లో చిన్న పాత్ర చేసిన అనసూయ ఆ వెంటనే క్షణం సినిమాలో కీ రోల్ లో నటించింది. అయితే అనసూయకి అలా కొన్ని ప్రత్యేక పాత్రల్లో చెయ్యడం కంటే హీరోయిన్ గా చేస్తే మంచి పేరు వస్తుంది. అలాగే డబ్బుకి డబ్బు కూడా వస్తుందనే ఉద్దేశ్యం తో ఆ వైపు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అనసూయకి అనుకున్నంత అవకాశాలు రాలేదు సరేకదా  ఐటమ్ లో అవకాశాలు వచ్చాయి. కానీ అనసూయ ఐటమ్ లో చేస్తే ఇక ఐటమ్ పాపాగా ముద్రపడి తన పేరు పోతుందనే ఉద్దేశ్యం తో అటు వైపు వెళ్లలేదు. కానీ వెండితెర మీద అవకాశాలు రాకపోవడంతో సడన్ గా సాయి ధరమ్ తేజ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.  

అయితే ఇప్పుడుఅనసూయ బుల్లితెర మీద చేసే కొన్ని ప్రోగ్రామ్స్ ని వదులుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యన అనసూయ ప్రముఖ టీవీ ఛానెల్ టివి 9  లో ‘ఏ డేట్‌ విత్‌ అనసూయ' ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రాం లో సినిమా హీరో, హీరోయిన్స్ ని తీసుకొచ్చి అనసూయతో డేటింగ్ చేపిస్తునారు ఆ టీవీ ఛానెల్ వారు. అయితే ఈ ప్రోగ్రాం పెద్దగా పాపులర్ కాలేదు. ఇక పాపులర్ సంగతి అటుంచి ఈ మధ్యన రెండు వారాలుగా ఆ ప్రోగ్రాం టివి 9  లో ప్రసారం కావడం లేదు. దీనికి కారణం ఆ ఛానెల్ వారికి అనసూయ అందుబాటులో లేకపోవడమేనట.. అందువల్లే ఈ ప్రోగ్రాం ఆ ఛానెల్లోప్రసారం కావడం లేదని చెబుతున్నారు. మరి అనసూయ సాయి చిత్రం విన్నర్ కోసం ఇప్పటికే ఐటమ్ సాంగ్ లో పాల్గొంటుంది. ఆ సాంగ్ షూట్ విదేశాల్లో జరగడం వల్ల అనసూయ ఆ ప్రోగ్రాంని చెయ్యలేకపోయింది. మరి మళ్ళీ టివి 9  వారు ఆ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తారా? లేక అనసూయతో ఎందుకులే అని లైట్ తీసుకుంటారో చూద్దాం.

మరి అనసూయ వెండితెర మీద వ్యామోహంతో ఇలా బుల్లితెర అవకాశాలు చేజార్చుకుంటే ఎలా.... కొంచెం ఆలోచిస్తే బెటర్ కదా అని అంటున్నారు అనసూయ అభిమానులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ