Advertisementt

తెలుగు డైరెక్టర్స్ ని పక్కనపెట్టేసాడా..!

Tue 15th Nov 2016 06:10 PM
junior ntr,director hari,ntr director hari combination  తెలుగు డైరెక్టర్స్ ని పక్కనపెట్టేసాడా..!
తెలుగు డైరెక్టర్స్ ని పక్కనపెట్టేసాడా..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తన జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా ఏ సినిమా కి కమిట్ అవ్వకుండా ఖాళీగా ఉంటున్నాడు.  డైరెక్టర్ చెప్పే కథలు ఎన్టీఆర్ కి నచ్చడం లేదో.... లేక అతిగా ఆత్రుత పడుతున్నాడో తెలియదు గాని అతనితో సినిమా తీసేందుకు సిద్ధంగా వున్న ఎంతోమంది డైరెక్టర్ల కి నో చెబుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఇష్టపడి చేద్దామనుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతానికి ఖాళీగా లేడు. ఇక సురేందర్ రెడ్డికి ఏదో బంపర్ ఆఫర్ రావడం వల్ల అతను ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా లేడు.  ఇక మిగతా డైరెక్టర్స్ ని నమ్మే పరిస్థితుల్లో ఎన్టీఆర్ లేకపోవడం వల్ల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఏమాత్రం క్లారిటీ లేకుండా టైమ్ తీసుకుంటున్నాడు.

అయితే తాజాగా ఎన్టీఆర్ కి  ఒక కథ నచ్చి సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. సింగం సీరీస్ తో మాంచి ఊపుమీదున్న తమిళ డైరెక్టర్ హరి తో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ ఆశక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. డైరెక్టర్ హరి సింగం సీరీస్ తో చితక్కొట్టేస్తున్నాడు. సింగం పార్ట్ లన్నిటిలోను సూర్యతో పోలీస్ డ్రెస్ వేయించి పోలీస్ కి సింహానికి తేడా లేదని చూపిస్తూ హిట్స్ కొడుతున్నాడు. సూర్యలోని నటుణ్ని పిండుతూ సినిమాలు చేస్తున్న హరి ఇప్పుడు మరో పోలీస్ స్టోరీ తోనే ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. 

ఇక డైరెక్టర్ హరి చెప్పిన కథ నచ్చడం తో ఎన్టీఆర్ హరితో సినిమా చెయ్యాలనుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కూడా హరి ఎన్టీఆర్ ని పోలీస్ డ్రెస్ లోనే చూపిస్తాడని అంటున్నారు. మరి తెలుగు డైరెక్టర్స్ చెప్పిన కథలు నచ్చక ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ ని ఎన్నుకున్నాడని చెబుతున్నారు. ఇక ఈ కాంబినేషన్ గనక నిజంగా సెట్ అయ్యి సినిమా తెరకెక్కితే ఆ సినిమా మాములు హిట్ అవ్వదని ఎన్టీఆర్ ఫాన్స్ చంకలు గుద్దేసుకుంటున్నారు.  మరి నిజంగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎన్టీఆర్ ఫాన్స్ చెప్పడం కాదుగాని అది గ్యారెంటీ హిట్ అవ్వడం మాత్రం ఖాయం అని అంటున్నారు సినీరంగ పెద్దలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ