Advertisementt

ధృవ యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీ..!

Tue 15th Nov 2016 11:30 AM
dhruva,ram charan,dhruva shooting,dhruva movie unit,mega power star  ధృవ యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీ..!
ధృవ యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీ..!
Advertisement
Ads by CJ

ధృవ సినిమా షూటింగ్ కి పేకప్ చెప్పేసారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్యాకప్ చెప్పేశామని రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ధ్రువకి సంబంధించి ఒక పాటను థాయిలాండ్ లో షూట్ చేశారు. ఆ పాటతో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడం తో ధృవ చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ గా కనబడుతున్నారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలైపోయాయి. ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులను పూర్తిచేసేసి ధృవ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 2  న విడుదల చెయ్యాలని చరణ్ కృతనిశ్చయంతో వున్నాడు. 

అయితే మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో చాలా సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. ధృవ సినిమా మాత్రం విడుదల పరంగా సమస్యలు ఎదుర్కునే అవకాశం కూడా కనబడడం లేదు. ఎందుకంటే మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన సమస్య సినిమా విడుదల సమయానికి చక్కబడే అవకాశం వుంది. ఇక ఏ సమస్య లేకుండా డిసెంబర్ లో విడుదల అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు యూనిట్ సభ్యులు.

ఇప్పటికే ధృవ చిత్ర ఆడియో మార్కెట్ లో కి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ పాటలకి సంబందించి కొన్ని బిట్స్ ని, ఈ సాంగ్స్ మేకింగ్ వీడియోస్ ని వదులుతూ పబ్లిసిటీ పరంగా కూడా ధృవ చాలా ముందంజలో వుంది. ఈ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే మాత్రం సినిమా పై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. ఇప్పటికే చరణ్ ధృవ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో మామ అల్లు అరవింద్ తో పాటు బిజిగా వున్నాడు. ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా హిట్ కొట్టాలనే కసితో చేసాడు. హీరోయిన్ రకుల్ కూడా చరణ్ తో తన రెండో సినిమాని హిట్ గా మలుచుకోవాలని కలలుకంటుంది. చూద్దాం డిసెంబర్ 2 న వీరు ఏ మేరకు సక్సెస్ ని అందుకుంటారో...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ