Advertisementt

శింబు ఇంత బ్యాడ్‌బోయా..!?

Mon 14th Nov 2016 11:31 PM
simbu,hansika,vallabha,director kabolu lingaswamy  శింబు ఇంత బ్యాడ్‌బోయా..!?
శింబు ఇంత బ్యాడ్‌బోయా..!?
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌లో హీరో శింబుకి బ్యాడ్‌బోయ్‌ ఇమేజ్‌ ఉన్న సంగతి కొత్తగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా 'వల్లభ' సమయంలో నయనతారను ప్రేమించి, ఆమెతో తాను చేసిన రొమాన్స్‌ను ఆయనే లీక్‌ చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత హన్సిక వంతు. ఇక ఆపై కూడా గ్యాప్‌ అనేది ఇవ్వకుండా, తనకు కాకుండా బ్యాడ్‌బోయ్‌ ఇమేజ్‌ మరెవ్వరికీ దక్కకూడదనే పంతం పూనిన వాడిలా గ్యాప్‌ వచ్చినప్పుడల్లా ఏదో ఒక వివాదంతో ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేస్తూ వస్తున్నాడు. నడిగర్‌ సంఘం ఎన్నికలప్పుడే కాకుండా వివాదం కావాలనుకున్నప్పుడల్లా విశాల్‌పై అనవసరంగా నోరు పారేసుకొంటూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ఇక 'బీప్‌' సాంగ్‌తో సంచలనం సృష్టించి కోలీవుడ్‌ మొత్తం తలదించుకునేలా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఆయన మరలా తన కెరీర్‌పై దృష్టి పెట్టాడని, ఇక బ్యాడ్‌బోయ్‌ ఇమేజ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడేమో అని అందరూ భావిస్తున్న తరుణంలో తన పాత ప్రియురాళ్లను ఏరికోరి, తనతో చిత్రాలు తీయాలని భావించే దర్శకనిర్మాతల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుని, హీరోయిన్లుగా ఎంత పారితోషికం అయినా ఇచ్చి నయనతార, హన్సికలను పెట్టుకోవాలనే కండీషన్‌ అప్లై చేసి వారితో చేసిన చిత్రాలలో ఇటీవల ఒకట్రెండు చిత్రాలను తన తెలివితో క్యాష్‌ చేసుకొని మరలా హీరోగా ఫర్వాలేదనే పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన మాజీ ప్రియురాళ్లు, వారితో తన రాచకార్యాలపై ఆసక్తి చూపిన వారిని తన చిత్రాలను చూసే వారి బలహీనతతో ఆటాడుకుంటున్నాడు. 

ఇక తెలుగులో నాగచైతన్య హీరోగా, రెహ్మాన్‌ సంగీతం అందించిన గౌతమ్‌మీనన్‌ సినిమా తమిళ వెర్షన్‌కు ఆ మాత్రం ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ వచ్చిందంటే అది అతని తెలివితేటల పుణ్యమే. ఇక తాజాగా ఆయన మరోసారి తన బ్యాడ్‌బోయ్‌ ఇమేజ్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు, త్వరలో అల్లుఅర్జున్‌తో ద్విభాషా చిత్రం తీయనున్న లింగుస్వామి చాలా కాలం కిందట శింబుతో హీరోగా ఓ చిత్రం చేయాలని భావించి, శింబుకు కోటి రూపాయల అడ్వాన్స్‌ ఇప్పించాడు. ఆ చిత్రం అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. శింబు మనస్తత్వం తెలిసిన డైరెక్టర్‌ కాబోలు లింగుస్వామి ఈ చిత్రానికి అడ్వాన్స్‌ ఇచ్చే సమయంలోనే ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోతే తనకు ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలని శింబుతో కండీషన్స్‌ అప్లై అన్నాడు. అనుకున్నంత జరిగింది. ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ శింబు మాత్రం ఆ అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వనంటూ లింగుస్వామికి గత కొంతకాలంగా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దీంతో లింగుస్వామి శింబుపై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం నిజమని తేలితే శింబుపై నిర్మాతల మండలి నిషేధం విధించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కుక్క తోక వంకరే అన్న విషయం శింబు విషయంలో మరోసారి నిరూపితం అయింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ