Advertisementt

అనసూయ మీద ఐటమ్.. అదరగొట్టిందట!

Mon 14th Nov 2016 11:28 PM
anasuya item song,anasuya vinner item song,sai dharam tej,gopichandh director  అనసూయ మీద ఐటమ్.. అదరగొట్టిందట!
అనసూయ మీద ఐటమ్.. అదరగొట్టిందట!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై చిక్కనైన తన బొద్దు బొద్దు మాటలతో, అందచందాలను ఆరబోస్తున్న అనసూయ అటు వెండితెరపై కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఇమేజ్ సంపాదించుకున్న ఈ హాట్ భామ ఈ మధ్య వెండితెరపై తన అందచందాలతో అందరినీ కట్టిపడేస్తుంది. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అత్తారింటికి దారేదిలో ఐటమ్ సాంగ్ కోసం ఆఫర్ ఇచ్చినా నో చెప్పిన ఈ భామ తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విన్నర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ ఇరగదీసిందంటున్నారు చిత్రబృందం. మామ పవన్ తో ఐటమ్ సాంగ్ కు నో చెప్పి అల్లుడు సాయి ధరమ్ తేజ చిత్రంలో అనసూయ... అనసూయ.. అంటూ సాగే పాటలో అనసూయ భలే చిందులేసిందని టాక్ నడుస్తుంది. ఈ మధ్యనే ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా జరుపుకుంది చిత్రబృదం. కాగా విన్నర్ చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగే హైలెట్ గా నిలుస్తుందని కూడా తెలుస్తుంది. ఈ సాంగ్ తో టాలీవుడ్ లో అనసూయ క్రేజ్ విపరీతంగా పెరగడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. కాగా విన్నర్ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ