ప్రముఖ దర్శకుడు రాజమౌళి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్టే కాకుండా, రాజమౌళిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం తాలూకూ విషయాలు ముచ్చటించాలంటే గంటలు, రోజులు, నెలలు సరిపోవు. అసలు 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి ఉందని ప్రపంచానికి తెలిసింది.ఆ ఘనత రాజమౌళి ద్వారానే సాధ్యమైంది. రాజమౌళిలో బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. అసలు బిజినెస్ మైండ్ లేకుండా అంచనాలు వేసుకొని లెక్క అంత పక్కాగా ఎలా వేస్తారనుకో అది వేరే విషయం.
గత నెలలో రాజమౌళి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఇక నుండి ప్రజలంతా మాట్లాడుకోవాలని, అలా మాట్లాడుకొనేలా తన ప్రచారం తాలూకూ ప్రయోగాలు ఉంటాయని వెల్లడించిన విషయం తెలిసిందే. అందో భాగంగా బాహుబలికి సంబంధించిన మేకింగ్ వీడియోస్ గట్రా విడుదల చేయడం జరింగింది. ఇంకా ప్రజలంతా నిరంతరం బాహుబలి గురించే మాట్లాడుకొనేలా తాజాగా బాహుబలి కథ కామిక్ బుక్ రూపంలోకి బయటకు తీసుకువచ్చారు. బాహుబలి చిత్రంలోని ప్రతీ సన్నివేశం, ప్రింట్ రూపంలో అచ్చు వేయించడం జరిగింది. దానికి ‘బాహుబలి-బాటిల్ ఆఫ్ ది బోల్డ్’ అని పేరు పెట్టారు. ఇంకా బాహుబలి, భళ్లాలదేవ, కట్టప్ప, శివగామి వంటి పాత్రలన్నీ కామిక్ పాత్రల రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ యానిమేషన్లను గ్రాఫిక్ ఇండియా సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని బాహుబలి బృందం అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఇక అలా పేజీల్ని తిరగేస్తూ ఉంటే, ఇలా బొమ్మలను చూస్తూ.. ఆ సన్నివేశానికి తగిన డైలాగుల్ని కూడా గుర్తు చేసుకొంటూ ఉండవచ్చన్నమాట. అలా వారంతా మహీష్మతీ సామ్రాజ్యంలోకి వెళ్లొచ్చన్నమాట.
అయితే రాజమౌళి తెలివి తేటలే తెలివి తేటలు. ఎందుచేతనంటే... అసలు రాజమౌళి ఈ సమయంలోనే ఈ కామిక్ పుస్తకం ఎందుకు విడుదల చేసినట్టు. పోయిన సంవత్సరం విడుదల చేయవచ్చుగా అంటే ఇక్కడో లాజిక్ ఉంది. ఇప్పటి నుంచే బాహుబలి 2 ప్రచారం రాజమౌళి మొదలెట్టాశాడన్నమాట. అంతే కాకుండా బాహుబలి 2 విడుదల తర్వాత కూడా ఇలాంటి మరో పుస్తకాన్ని విడుదల చేస్తారట. అయితే ఇక బాహుబలి2 ను కూడా కామిక్ రూపంలో చూడొచ్చన్నమాట. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలే కామిక్ పుస్తకాలలో స్థానాన్ని పొందాయి. కాగా ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా అలా రావడం, అదీ మన తెలుగు సినిమా అయి ఉండటం నిజంగా గర్వకారణమే. ఇది కూడా మన రాజమౌళి గారి బిజినెస్ ట్రిక్స్ లో భాగమే. ఇక బాహుబలి2 విడుదలయ్యేంత వరకు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో వేచి చూద్దాం.