బాలీవుడ్ బ్యూటి దీపికా పడుకొనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీపికా బాలీవుడ్ లో ప్రవేశించి తొమ్మిద సంవత్సరాలు గడిచినా ఈ మధ్యనే వచ్చినట్లు అనిపిస్తుందని ఆమె పేర్కొన్నది. పరిశ్రమలో తెలుకోవాలనే గానీ ఎప్పటికప్పుడు, ఏరోజుకారోజు కొత్తగానే ఉండాలి. అలా అప్ డేట్ అవుతుంటేనే ఇక్కడ రాణిస్తామని ప్రముఖ బాలీవుడ్ స్టార్ దీపికా పడుకునే వెల్లడించింది. కాగా పద్మావతి వంటి సాహసోపేతమైన చిత్రాల్లో నటించేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమేనంటుంది ఈ బాలీవుడ్ భామ.
కాగా తాజాగా దీపికా పడుకొనే మాట్లాడుతూ... తాను ఇంకా చేయాల్సినది చాలా ఉందని, ఇంకా మరిన్నే చిత్రాల్లో ఎన్నో సాహసోపేతమైన పాత్రల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వివరించిందీ.అయితే పద్మావతి చాలా కష్టమైన పాత్ర అని, కానీ తాను ఆ పాత్ర చేసేందుకు ఎంతగానో ఆసక్తి కనపరుస్తున్నానని వివరించింది. చివరగా అసలు ఆ పద్మావతి పాత్రతో ట్రావెల్ చేసేందుకు, ఆ పాత్రలో సంలీనమై అనుభవించేందుకు, ఆ అనుభవాన్ని ఆస్వాదించేందుకు ఎంతో సిద్ధంగా ఉన్నానంటుంది ఈ భామ.