Advertisementt

శ్రీ రెడ్డి కష్టాలు!!

Mon 14th Nov 2016 05:43 PM
srinivas reddy,jayammu nischayammu raa movie,publicity,saptagiri express movie,saptagiri  శ్రీ రెడ్డి కష్టాలు!!
శ్రీ రెడ్డి కష్టాలు!!
Advertisement
Ads by CJ

తన సినిమా ప్రమోషన్ కోసం నేరుగా రంగంలోకి దిగాడు కమేడియన్ శ్రీనివాసరెడ్డి. ప్రత్యర్థి సినిమా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' బిజినెస్ లో, ప్రచారంలో దూసుకెళుతోంది. దాంతో పోలీస్తే శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' చాలా వెనుక ఉంది. అంతే శ్రీ రెడ్డి మేల్కొన్నాడు. ప్రచారం కోసం మార్గాలు వెతుకుతున్నాడు. పరిశ్రమలో ఉన్న పరిచయాలతో సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల లుక్స్ విడుదల చేస్తూ ప్రచారం పొందాలని చూస్తున్నాడు. ఇంకా తనకు క్లోజ్ ఉన్న హీరోలతో మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

 సప్తగిరి రాకతో కొందరు కమేడియన్స్ కు వేషాలు తగ్గాయనేది వాస్తవం. అతడి దూకుడు జోరుమీద ఉంది. ఇప్పుడు హీరోగా కూడా మారాడు. ఆడియో రిలీజ్ కు పవన్ రావడంతో హైలెట్ అయింది. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'తో పోలిస్తే 'జయమ్ము నిశ్చయమ్మురా' ప్రమోషన్ డల్ గా ఉంది. ఈ సినిమాకు బిజినెస్ ప్రోత్సహకరంగానే ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రచారం లేదని బయ్యర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సప్తగిరి కంటే శ్రీ రెడ్డి సీనియర్. 'గీతాంజలి' సినిమాలో కీలక పాత్రధారిగా చేశాడు. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా నటి పూర్ణతో కలిసి నటిస్తున్నాడు. కెరీర్ లో ఈ సినిమా కీలకం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

 ఒకే సారి ఇద్దరు కమేడియన్లు హీరోలుగా నటిస్తున్న చిత్రాలు నిర్మాణంలో ఉండడం చేత పరిశ్రమ వర్గాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ