Advertisementt

అదేంటి పెళ్ళికోసం ఆర్టిస్టులను కొంటున్నారా.?

Mon 14th Nov 2016 12:10 PM
  అదేంటి పెళ్ళికోసం ఆర్టిస్టులను కొంటున్నారా.?
అదేంటి పెళ్ళికోసం ఆర్టిస్టులను కొంటున్నారా.?
Advertisement
Ads by CJ
కర్ణాటక రాజకీయ నాయకుడు, మైనింగ్ మాఫియాగా పేరొందిన గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నుండి చాలామంది తారగణం కదిలి వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఆ రకమైన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుపుతున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాగా టాలీవుడ్ నుండి ప్రముఖ నటులు కచ్ఛితంగా హాజరయ్యేందుకు తగిన ఏర్పాట్లలో భాగంగా మొండికేస్తున్న వారికి డబ్బులు ఎర చూపి మరీ ఆయా నటులు పెళ్ళికి కచ్చితంగా హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున అంతర్గతంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. అందుకు సంబంధించి పరిశ్రమలో గాలి జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన కొంతమంది తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బళ్ళారిలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా పెళ్ళి జరిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు గాలి తాలూకూ శిబిర పెద్దలు. ఆ దిశగా తెలుగు పరశ్రమలోని పెద్దలను పెళ్ళికి తప్పకుండా తీసుకొచ్చేందుకు సినీ నటుడు సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకోసం బ్రహ్మానందానికి ఏకంగా రూ.15 లక్షలు ఇవ్వడానికి గాలి శిబిరం తరఫున ఈ వ్యక్తులు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా గాలికి అత్యంత సన్నిహితుడైన అయ్యప్పకు  సరిత అనే ఓ మహిళ కూడా అందుకు సహకరిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తాని గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహంలో భాగంగా  వధూవరులను ఆశీర్వదించడానికో మరి తన హోదాను ప్రదర్శించుకోడానికో గాని సినీ పరిశ్రమలోని నటులను డబ్బులిచ్చిమరీ హాజరుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారన్న మాట.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ