Advertisementt

నల్లధనంపై మోడి ఎమోషనల్ స్పీచ్.. !

Sun 13th Nov 2016 06:57 PM
pm mody,mody decision on block money,mody gova emotional speech  నల్లధనంపై మోడి ఎమోషనల్ స్పీచ్.. !
నల్లధనంపై మోడి ఎమోషనల్ స్పీచ్.. !
Advertisement
మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు భారత్ లో అంతటా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లధనం, నకిలీ కరెన్సీలను తగ్గించే క్రమంలో రూ.500, రూ1000 నోట్లను రద్దు చేస్తూ మోడీ ఇంతటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా డిసెంబర్ 31లోగా పాత కరెన్సీని డిపాజిట్ చేయాలని, విత్ డ్రాయల్స్ మాత్రం విడతలవారీగా తీసుకోవాలని సర్కారు పేర్కొంది. అయితే ఈ నిర్ణయం నల్లధనాన్ని పెద్దమొత్తంలో కలిగిన ఉన్నవారిపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు గానీ సామాన్యుడు మాత్రం  అష్టకష్టాలు పడుతున్న విషయం వాస్తవం. 
కాగా ఈ విషయంపై మోడీ ఈరోజు మద్యాహ్నం భావోద్వేగంతో ప్రసంగించాడు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. నల్లధనాన్ని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం ఎంతో ముఖ్యమైందని ఆయన వెల్లడించాడు. భారత దేశ ప్రజలు తనకు అవినీతిని అంతం చేయమని అధికారం అప్పజెప్పాలని, అలా కాకుండా అవినీతితో ప్రభుత్వ పాలన చేయడం కష్టసాధ్యమని వివరించాడు. ఇంకా మోడీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఎదుర్కుంటున్న అవస్తను చూస్తే బాధగానే ఉందని తాను తీసుకున్న ఈ నిర్ణయంలో తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని వివరించాడు మోడి. ఈ నిర్ణయంతో మరో 50 రోజులు కాస్త ఇబ్బందులు ఉంటాయని, బినామీ ఆస్తులపై కూడా చర్యలు తీసుకుంటామని వివరించాడు మోడి.  మొత్తం వ్యవస్థను  గాడిలో పెట్టేందుకు ప్రజలకు కొంత ఇబ్బందులు తప్పవని, ఈ విషయాన్ని ప్రజలు పెద్ద మనుసులో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని వివరించాడు నరేంద్ర మోడి. కాగా 2జి స్కాం నిందుతులు కూడా ప్రస్తుతం పాత నోట్లు మార్చుకోడానికి క్యూలో నిల్చుంటున్నారని ప్రతిపక్షంపై విమర్శలు చేశాడు. కాగా ఈ నిర్ణయంపై సామాన్యుడు పెద్ద మనుస్సుతో అర్థం చేసుకోవాలని కోరాడు. 
అయితే > మోడి నల్లధనం విషయంలో తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా కలకలం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అందాల తార ఐశ్వర్యారాయ్ స్పందించి మోడికి లేఖ రూపంలో తన భావాలను పంచుకుంది. 'ఒక ఇండియన్ గా మనస్పూర్తిగా ప్రధానిని అభినందిస్తున్నా దేశాన్ని అవినీతి, లంచగొండితనం నుంచి బయటపడేసేందుకు మీరు చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. మార్పు ఎన్నడూ సులభంగా జరగదు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని స్వయంగా ఐశ్వర్యారాయ్ చెప్పడం విశేషం.
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement