Advertisementt

ధ్రువ సెట్స్ లో సెలెబ్రిటీల సందడి!!

Sun 13th Nov 2016 05:49 PM
ram charan,chiranjeevi,druva song movie making,allu arjun,sruthi hassan,akhil,vinayak,koratala,sukumar,rakul preeth singh  ధ్రువ సెట్స్ లో సెలెబ్రిటీల సందడి!!
ధ్రువ సెట్స్ లో సెలెబ్రిటీల సందడి!!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ధ్రువ చిత్రానికి పబ్లిసిటీ బాగా పెంచేశారు. ఏదో ఆడియో ని కామ్ గా మార్కెట్ లోకి వదిలేసినా... వీడియో సాంగ్స్ బిట్స్ ని వదులుతూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నారు. ధ్రువ సాంగ్ మేకింగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.  ఇక నిన్నటికి నిన్న... 'చూసా.. చూసా' సాంగ్ మేకింగ్ ని విడుదల చేసిన ధ్రువ చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా 'నీతోనే...' డాన్స్ సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది.

'నీతోనే...' డాన్స్  సాంగ్  మేకింగ్ లో మెగా ఫ్యామిలీ సందడి చేశారు. మెగా ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ ఈ సాంగ్ మేకింగ్ లో కనబడి రామ్ చరణ్ తో కబుర్లు చెబుతూ సందడి చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో మేకింగ్ లో రామ్ చరణ్ తన భార్య తో బాగా ఎంజాయ్ చేసాడు. భార్య ఉపాసనతో కలిసి ధ్రువ సాంగ్స్ సెట్ లో కూల్ గా కనిపించాడు. ఇక అలాగే తన తండ్రి చిరంజీవితో చరణ్ మంతనాలు జరుపుతూ తెగ ఆలోచిస్తూ కనిపించగా... రకుల్ డాన్స్ స్టెప్స్ తో చంపేసింది. ఇక రామ్ చరణ్ మామ అల్లు అరవింద్  ఈ సినిమా కి ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ప్రొడ్యూసర్ హోదాలో కనబడ్డాడు. కానీ అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు  కూడా  ధ్రువ సాంగ్ మేకింగ్ వీడియో లో రచ్చ రచ్చ చేశారు. రామ్ చరణ్ తో కలిసి అల్లు అర్జున్ ఏదో డీప్ డిస్కర్షన్ లో కనిపించాడు. ఇక రామ్ చరణ్ అక్క సుశ్మిత కూడా సెట్లో సందడి చేసింది. ఇక రామ్ చరణ్ కి బాగా పరిచయమున్న శృతి హాసన్ కూడా ఈ మేకింగ్ వీడియో లో కనిపించి హంగామా చేసింది. చరణ్ ఫ్రెండ్ అఖిల్ కూడా ధ్రువ సెట్స్ లో మెరిశాడు. అలాగే తన తండ్రి చిరు 150  వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వి. వి. వినాయక్, చరణ్ నెక్స్ట్  ప్రాజెక్ట్ చెయ్యబోయే సుకుమార్, ఇక 3 సూపర్ హిట్స్ తో జోరు మీదున్న కొరటాల కూడా రామ్ చరణ్ ధ్రువ సాంగ్ మేకింగ్ వీడియోలో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇక చరణ్ బాబాయి పవన్ తో సినిమా కమిట్ అయిన ఏ. ఎం .రత్నం కూడా ధ్రువ సెట్స్ సందడి చేశారు.

రామ్ చరణ్ తన తండ్రి సినిమా ఖైదీ నెంబర్ 150  ని ప్రొడ్యూస్ చేస్తూనే మరో పక్క ధ్రువ సినిమా చేసాడు. ఇక ఈ ధ్రువ  సినిమాలో మెగా ఫ్యామిలీ అంతా షూటింగ్ స్పాట్ లో రామ్ చరణ్ ని బాగా ఎంకరేజ్ చేశారని ఈ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక సెలెబ్రిటీస్ కూడా రామ్ చరణ్ తో చేరి ధ్రువ సెట్లో సందడి చేసారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సాంగ్ మేకింగ్ చూసిన వారు ఈ మేకింగ్ వీడియో తో  సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ