బాలనటిగా మలయాలంలో చేసి, ఆ తర్వాత హీరోయిన్ అయిపోయి తమిళ తెలుగు భాషల్లోకి ప్రవేశించిందీ మలయాళీ భామ అను ఇమ్మాన్యుయేల్. తాజాగా ఆమె అరంగేట్రం చేసిన మాలీవుడ్ పైనే విమర్శలు కురిపించడంతో దుమారు రేగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ను ప్రశంసిస్తూ మాలీవుడ్ ను దూషించిన ఈ భామ విషయం హాట్ టాపిక్ గా మారింది.కాగా మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాలీవుడ్ పై విమర్శలు గుప్పించి అదే విషయాన్ని మరో ఇంటర్వ్యూలో కూడా కుండబద్దలు కొట్టినట్టుగా వెల్లడించింది.
ఇంతకీ ఆ మాలీవుడ్ భామ ఏమన్నదంటే.. నేను తెలుగు, తమిళం,మలయాళం మూడు భాషల్లో హీరోయిన్ గా నటించాను. అయితే తెలుగు, తమిళంలో హీరోయిన్లను చిత్రబృందం బాగా చూసుకుంటుంది. అదే మలయాళంలో అయితే హీరోయిన్లకు తగిన గౌరవం లభించదు. నిజంగా నేను మాలీవుడ్ ను చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నాను అంటూ వెల్లడించింది ఈ భామ. నిండా 20 యేళ్ళు కూడా నిండని ఈ భామ తనకు దర్శకత్వం చేయడం అంటే బాగా ఇష్టమని, భవిష్యత్తులో తప్పుకుండా డైరెక్షన్ చేస్తానంటూ చెప్పింది కూడాను. అంతే కాకుండా తెలుగులో ఆక్సిజన్ తో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నానని, తమిళంలో కూడా రెండు సినిమా చేతిలో ఉన్నాయంటూ తెగ మురిగిపోతూ చెప్పేసింది ఈ మలయాళీ భామ అను ఇమ్మాన్యుయేల్.