Advertisement

వెంకీ తప్పుచేస్తున్నాడా?

Sat 12th Nov 2016 08:26 PM
venkatesh,chiranjeevi,guru movie,nagarjuna,venkatesh new movie guru released  వెంకీ తప్పుచేస్తున్నాడా?
వెంకీ తప్పుచేస్తున్నాడా?
Advertisement

సంక్రాంతి బరిలోకి ఆల్‌రెడీ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం ఖైదీ నెంబర్‌ 150, నందమూరి నటసింహం బాలకృష్ణ 

నటిస్తున్న వందో చిత్రంగా మరో ప్రతిష్టాత్మకమైన చారిత్రక నేపధ్యం ఉన్న, కొత్తదనం ఉన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'ల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల సంక్రాంతికి గ్యారంటీ అని తెలుస్తోంది. ఎవరి సినిమాపై ఉన్న నమ్మకంతో వారు తమ చిత్రాలను ఇదే పండగ బరిలో దించాలని నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా వేగంగా షూటింగ్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌ వంటి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకే థియేటర్లు సరిపోవని అందరూ అభిప్రాయపడుతున్న తరుణంలో వీరి కోసం నాగార్జున తన 'నమో వేంకటేశాయ' చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. కానీ ఈ స్దానంలోకి విక్టరీ వెంకటేష్‌ వచ్చి చేరాడన్న వార్తలను ట్రేడ్‌ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు కన్‌ఫర్మ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో దిగినప్పటికీ ఏ చిత్రం కూడా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు పడలేదు. ఏ జోనర్‌కు చెందిన చిత్రాలు ఆయా ప్రేక్షకుల అభిరుచిని బట్టి బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాలనే సాధించాయి. 'నాన్నకు ప్రేమతో, డిక్టేటర్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలు విడుదలైనప్పటికీ మొదటి వారం మాత్రం ఏ జోనర్‌ చిత్రాలను ఆయా ప్రేక్షకులు ఆ వారంలోనే చూశారు. కానీ వారం దాటిన తర్వాత మాత్రం అన్ని జోనర్లను కలగలిపి ఎక్కువగా ప్రేక్షకులను ఆదరించిన చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయనా' నిలబడటంతో రెండో వారం నుంచి ఆ చిత్రానికి లాంగ్‌ రన్‌ లభించి, అన్ని చిత్రాలను కాదని నెంబర్‌వన్‌ స్దానాన్ని దక్కించుకుంది. అలాగే ఈ చిత్రం అందరినీ 

ఆకర్షించడానికి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్‌ మిగిలిన పోటీ చిత్రాల హీరోలతో పోలిస్తే ఎక్కువగా నాగార్జున, రమ్యకృష్ణలకు ఉండటం కూడా ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అయింది. ఇప్పుడు వెంకీ సంక్రాంతి బరిలోకి దిగడానికి రెడీ అవ్వడం వెనుక ఈ సెంటిమెంట్లు బాగా పనిచేశాయని అంటున్నారు. రేపు సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలు వివిద జోనర్‌లకు సంబంధించినవి కావడం, అన్ని జోనర్లను ముఖ్యంగా అందరి హీరోల అభిమానులను ఆకర్షించగల... ముఖ్యంగా ఫ్యామిలీ, లేడీ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న వెంకీ చిత్రం కావడం ఒక బలమైన కారణం. ఇది కూడా సోగ్గాడే తరహాలో అన్ని జోనర్లను మెప్పించే నవరస చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వెంకీకి బలంగా ఉండటంతో ఆయన సోగ్గాడే నుండి స్ఫూర్తిని పొంది తన చిత్రాన్ని బరిలో నిలుపుతున్నాడు. కానీ ఈ చిత్రం ఒరిజినల్‌ 'సాలా ఖద్దూస్‌' చిత్రం చూసిన వారు మాత్రం ఇది కూడా కేవలం ఒక రకం ప్రేక్షకులను మాత్రమే ఆకర్షించగలదని అంటున్నారు. విమర్శకులు కూడా అదే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ బాక్సింగ్‌ కోచ్‌ జీవితగాథ, ఇందులో బాక్సింగ్‌ కోచ్‌గా గడ్డంపెంచి ఈ చిత్రం ఒరిజినల్‌లో నటించిన మాధవన్‌ తరహాలోనే వెంకీ సైతం మిడిల్‌ ఏజ్‌డ్‌ కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఎక్కువగా క్రీడానేపద్యంలో తెరకెక్కనుంది. కాబట్టి ఈ చిత్రానికి'సోగ్గాడే చిన్నినాయనా' తరహాలో యూనివర్శల్‌ అప్పీల్‌ ఉండదని, మహిళలు, ఫ్యామిలీ ప్రేక్షకులను నమ్ముకుంటే వారిని ఈ చిత్రం పెద్దగా 

ఆకర్షించలేదని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మరో పెద్ద మైనస్‌ పాయింట్‌ ఉంది. ఈ చిత్రం తెలుగులో 

పూర్తిగా రీమేక్‌ కావడం లేదు. అలాగే అచ్చమైన తెలుగుదనం ఉన్న చిత్రం కాదు. కేవలం బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో నటించిన ఆర్టిస్ట్‌లే ఈ చిత్రంలో కూడా కనిపిస్తారు. కేవలం మాధవన్‌ స్దానంలో వెంకటేష్‌ కనిపించాల్సిన సన్నివేశాలను మాత్రమే రీషూట్‌ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రంలో మనకు వెంకీ తప్ప మిగిలిన ఆర్టిస్ట్‌లతో పెద్దగా సంబంధం, అనుబంధం లేని, తెలుగు నేటివిటీకి దూరంగా నిర్మిస్తున్న చిత్రం. ఈ చిత్రానికి దర్శకురాలైన సుధా కొంగర, హీరోయిన్‌గా నటించిన రితాకాసింగ్‌లు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అసలు ఈ చిత్రాన్ని హిందీ, తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్‌ చేస్తేనే బాగుంటుందని, ఈ చిత్రం ఒరిజినల్‌లో వెంకీ పాత్రను పోషించిన మాధవన్‌కు తెలుగులో కూడా గుర్తింపు ఉంది కాబట్టి ఈ చిత్రం డబ్బింగ్‌గా అయితే మరింత పెద్ద విజయం సాధిస్తుందని కొందరు విశ్లేషకులు తేల్చేస్తున్నారు. మరోపక్క సంక్రాంతి బరిలో వెంకీ కూడా నిలిస్తే చిరు, బాలయ్య, వెంకీలు 2001 తర్వాత మరలా ఒకేసారి బాక్సాఫీస్‌ బరిలో దిగడం ఇదే అవుతుంది. 2001లో బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు', చిరంజీవి నటించిన 'మృగరాజు', వెంకటేష్‌ నటించిన 'దేవీపుత్రుడు' చిత్రాలు విడుదలయ్యాయి. కాగా ఈ రేసులో బాలయ్య తన 'నరసింహనాయుడు' చిత్రంతో చరిత్ర సృష్టించగా, చిరంజీవి నటించిన 'మృగరాజు' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వెంకీ నటించిన 'దేవీపుతుడు' నరసింహనాయుడు ప్రభంజనాన్ని కూడా కాస్త తట్టుకొని జస్ట్‌ ఓకే అనిపించుకుంది. ఆనాడు బాలయ్య నటించిన 'నరసింహనాయుడు' అంత పెద్ద హిట్‌ అయినా కూడా పోటీకి తట్టుకొని తమ దేవీపుత్రుడు చిత్రం ఫర్వాలేదనిపించిందని, అదే నరసింహనాయుడు ప్రభంజనం అంతగా లేకపోతే తన చిత్రం కూడా హిట్టయి ఉండేదని వెంకీ నమ్మకం. ఆ నమ్మకమే ప్రస్తుతం సంక్రాంతి రేసులో వెంకీ 'గురు' చిత్రం నిలవడానికి కారణమంటున్నారు. ఏదిఏమైనా సుదీర్ఘ సినీ అనుభవం ఉన్న వెంకీ సంక్రాంతి పోటీకి దిగకపోవచ్చని, అదే జరిగితే వెంకీ నిర్ణయం సరైనదిగా నిరూపితమవుతుందని, కారణం ఏదైనా సరే వెంకీ తన చిత్రాన్ని ఏదో ఒక వంకతో బరిలో దిగకపోవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement