Advertisement

హ్యాట్రిక్‌ టెన్షన్‌లో రామ్‌చరణ్‌...!

Sat 12th Nov 2016 07:57 PM
ramcharan.allu arjun,dhruva movie,geetha arts  హ్యాట్రిక్‌ టెన్షన్‌లో రామ్‌చరణ్‌...!
హ్యాట్రిక్‌ టెన్షన్‌లో రామ్‌చరణ్‌...!
Advertisement

తనని తాను ట్రెండ్‌ సెట్టర్స్‌గా భావించడం మన స్టార్స్‌ ఎక్కువ. రామ్‌చరణ్‌ది కూడా ఇదే సమస్య. అందుకే తనకు ఎలాగైనా హిట్టివ్వాలని భావిస్తున్న మావయ్య అల్లుఅరవింద్‌పై కోపగించుకున్నాడట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కొడుకు అల్లుఅర్జున్‌ నటించిన, దానిని నిర్మించిన ఆయన తండ్రి, గీతాఆర్ట్స్‌ అధినేత అల్లుఅరవింద్‌ తమ 'సరైనోడు' చిత్రానికి ఓ కొత్త రూట్‌ ఫాలో అయ్యాడు. ఈ విధానాన్ని ఇంతకు ముందే కొందరు స్టార్స్‌కి పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఈ ఫార్ములా అప్లై చేయడానికి మన స్టార్స్‌కు పలు సందేహాలు ఉన్నాయి. దాంతో ఆ ఫార్ములా ఎవ్వరు అప్లై చేయలేదు. కానీ అల్లుఅరవింద్‌ మాత్రం కొన్ని కుటుంబ సమస్యల వల్ల 'సరైనోడు' చిత్రానికి ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చేయకుండా పాటలను ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశాడు. ఆ ఆడియో వేడుకకు అయ్యే ఖర్చుతో ఆ తర్వాత సినిమా ప్రమోషన్‌ను విపరీతంగా పెంచి సినిమా విడుదల ముందు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేశాడు. ఇది ఏ సినిమాకైనా చేసే ఆడియో సక్సెస్‌ మీట్‌ వంటిదే. ఆడియో ఫంక్షన్‌ను చేసినా కూడా నేడు ప్రతి సినిమాకి ఇలాంటి ఆడియో సక్సెస్‌ మీట్‌లు తప్పవు. అయితే అల్లుఅరవింద్‌ ఆడియో వేడుక ద్వారా మిగిలిన డబ్బును ప్రమోషన్‌కు వాడి. అందరూ కామన్‌గా చేసే ఆడియో సక్సెస్‌మీట్‌కు పేరు మార్చి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేసి, రెండు వేడుకలకు అయ్యే ఖర్చును ఒకే ఫంక్షన్‌ చేసి తన తెలివి చూపించాడు. అదే ఫార్ములాను అల్లుఅర్జున్‌ తమ్ముడు, తన చిన్న కొడుకు అల్లు శిరీష్‌ హీరోగా నటించిన 'శ్రీరస్తు... శుభమస్తు' చిత్రానికి కూడా ఫాలో అయ్యాడు. ఇలా తన కొడుకైన అల్లుఅర్జున్‌ సినిమా 'సరైనోడు' చిత్రం తరహాలోనే తన 'ధృవ' ఆడియో ఫంక్షన్‌ కూడా చేయకుండా బన్నీ చూపించిన బాటలో నడవడం చరణ్‌కు కోపం తెప్పించిందిట. దాంతో 'ధృవ' చిత్రానికి సైతం ఆడియో వేడుక వద్దు అన్న అల్లుఅరవింద్‌తో 'ఆడియో ఫంక్షన్‌' కావాల్సిందే. కావాలంటే ఆ ఫంక్షన్‌కు అయ్యే డబ్బు నేను స్వయంగా చెల్లిస్తానని చెప్పి, ఈ విషయాన్ని తన తండ్రికి కూడా ఫిర్యాదు చేశాడట. అంటే బన్నీ చూపిన దారిలో నడిచాడనే చెడ్డపేరు చరణ్‌ తనకు వస్తుందని భయపడటమో లేక ఇగో ప్రాబ్లమో కారణం కావచ్చు. కానీ అల్లుఅరవింద్‌ తాను ఆడియోఫంక్షన్‌ చేయను అన్న దానికి అరవింద్‌ను పిసినారిగా చరణ్‌ భావించడమో జరిగిందని టాక్‌. కానీ అన్నీ తెలిసిన తన తండ్రి చిరంజీవి సైతం అల్లుఅరవింద్‌ 'సరైనోడు' రూట్‌లోనే వెళ్లమని, అల్లుఅరవింద్‌ అంచనాలు ఎప్పుడు తప్పలేదని, తన స్వీయజీవితంలో జరిగిన పలు సంఘటనలను చెర్రీకి వివరించాడట. అప్పుడు కానీ చెర్రీ, బన్నీ రూట్‌లో నడవడానికి ఒప్పుకోలేదు. ట్రెండ్‌ సెట్‌ చేసే తాను ట్రెండ్‌ ఫాలోకావడం చరణ్‌ నామోషీగా ఫీలయ్యడని స్పష్టమవుతోంది. చివరకు చెర్రీ ఓకే చెప్పాడు. ఆడియో నేరుగా మార్కెట్‌లోకి విడుదలైంది. తమిళ ఒరిజినల్‌కు సంగీతం అందించి, పెద్దగా తెలుగు ట్రెండ్‌, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి తెలియని కొత్తవాడు అయినా మొదటి చిత్రమే చరణ్‌లాంటి స్టార్‌కు, అందునా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో వచ్చిన అవకాశాన్ని హిప్‌హాప్‌ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకకు ఖర్చు పెట్టే మొత్తాన్ని అల్లుఅరవింద్‌ తన మాట నిలుపుకొని మొత్తం ప్రమోషన్‌కు ఖర్చుపెడుతున్నాడు. ఈ చిత్రం ప్రకటనలు టీవీల్లో అదీ ప్రైమ్‌టైమ్‌లో ఎక్కువ మొత్తం వసూలు చేసే చానెళ్లలో కూడా ఈ చిత్రం ప్రకటనల మోత మోగుతోంది. దీంతో ఈ చిత్రం సాంగ్స్‌ బీట్స్‌ అందరి చెవులకు అలవాటవుతున్నాయి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కూడా ఖరారైంది. ఎవరిని ఫాలో అయినా సరే ఫైనల్‌గా తన చిత్రం హిట్‌ కావడం ఇప్పుడు హీరోగా రామ్‌చరణ్‌ ముందున్న లక్ష్యం. 'నాయక్‌' తర్వాత చరణ్‌ నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదు.'ఎవడు'కు డబ్బులు వచ్చినా నిర్మాతకు వడ్డీలకే సరిపోయింది. ఇక 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా ఫైనాన్స్‌పరంగా జస్ట్‌ ఓకే అనిపించుకుంది. ఇక 'బ్రూస్‌లీ' అయితే దారుణంగా నష్టపరిచింది. మరి రామ్‌చరణ్‌తో పాటు మెగాభిమానులు సైతం చరణ్‌కు హ్యట్రిక్‌.. అదేనండీ... ఫ్లాప్‌ల్లో హ్యాట్రిక్‌ వస్తుందేమో అనే టెన్షన్‌లో ఉన్నారు. మరి ఆ పరిస్దితి నుండి తన మేనల్లుడిని అల్లుఅరవింద్‌ కాపాడుతాడని, 'మగధీర' స్దాయిలో కాకపోయినా 'సరైనోడు'నైనా అధిగమించేలా చేయాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement