తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యం కారణంగా 50 రోజులుగా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తీవ్ర జ్వరం డీహైడ్రేషన్ కారణంగా సెప్టెంబరు 22వ తేదీ అర్ధరాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరి ఇంకా చికిత్స పొందుతూ ఉంది. అయితే అప్పట్లో శ్వాసకోస సంబందం ఇష్యూలు ఉన్నాయని ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండటంతో విదేశాల నుండి వైద్యులను కూడా తీసుకొచ్చి మరీ చికిత్స చేయిస్తున్నారు. అయితే అమ్మ ఆసుపత్రిలో చేరి సరిగ్గా 50 రోజులు అయ్యింది.
అయితే ప్రస్తుతం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాగా మెరుగుపడి సాధారణ స్థితికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే అమ్మకు ఇంకా చికిత్స అందిస్తూనే ఉన్నారు గానీ, పూర్తిగా సాధారణ స్థితిలోకి వచ్చి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇంకా కూడా లండన్ వైద్యుడు రిచర్డ్ సింగపూర్ ఫిజియోథెరపిస్టు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అమ్మకు చికిత్స చేస్తూనే ఉన్నారు గానీ, ఇంకెంతకాలం ఇలా ఆసుపత్రిలోనే ఉంటుందన్న విషయంలో పూర్తిగా స్పష్టత రాకుండా ఉంది. అయితే అప్పట్లో కొన్ని రోజుల క్రితం అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోందని ప్రకటించడంతో అభిమానులు, కార్యకర్తలు కాస్త శాంతించిన విషయం తెలిసిందే. ఇంకా అమ్మ పూర్తిగా కోలుకోవాలని పూజలు చేస్తూనే ఉన్నారు తమిళనాడు ప్రజలు. అయితే ఇప్పుడు తెలుస్తున్న దాన్ని బట్టి ఒక వారం రోజుల్లో అమ్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అమ్మ పడకపై కూర్చొని టివిలు గట్రా చూస్తూ, పత్రికలు కూడా చదువుతుండటంతో ఆమె త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతుందన్న విషయం తెలుస్తుంది.