ప్రధాని మోదీ రూ.500, రూ.1000లు రద్దు చేసే నిర్ణయాన్ని కొందరు బాలీవుడ్ స్టార్స్‌తో సహా టాలీవుడ్ స్టార్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, మీడియా ముందు, సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ యంగ్ స్టార్ గురించి మాత్రం మనం బాధపడాలి. ఈ స్టార్ తాను నటించే సొమ్ములో కొంత భాగాన్ని వైట్‌గానూ, కొంత భాగాన్ని బ్లాక్‌గానూ తీసుకుంటున్నాడు. ఇది అందరి విషయంలో జరిగే సంగతే కదా...! అని మీరు ఆ స్టార్ బాధను అర్ధం చేసుకోకపోతే ఎలా? చెప్పండి. ఆ స్టార్ ప్రధాని మోదీ నిర్ణయాన్ని ట్విట్టర్‌లో తెగ పొగిడేస్తూ, అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. కానీ ఆ ముందు రోజు రాత్రి ఆయన ఓ సినిమాకు కమిట్ అయి. 25కోట్లను బ్లాక్‌లో అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అది కూడా ఊరికినే కాదు.. శంషాబాద్ వద్ద ఓ ల్యాండ్ డీలింగ్ కోసం ఆయన ఆ మొత్తాన్ని దాచాడు. ఒక ఐదారుగంటల వ్యవధిలోనే ే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమాలలోకి బ్లాక్‌మనీ ఎక్కువగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం నుంచే వస్తుంది. ఇది అందరికీ తెలుసు, ముందుగా రియల్‌ఎస్టేట్ మనీ సినిమాలలోకి, సినిమాల నుంచి మరలా రియల్‌ఎస్టేట్ రంగంలోకి సైకిల్ చైన్‌లాగా తిరుగుతుంటుంది. శంషాబాద్ వద్ద చేయబోయే డీల్ తనకు మరో అదనపు రూ.25కోట్లును సాధించి పెడుతుందని భావించాడు ఈ స్టార్‌హీరో. వాస్తవానికి ఆ హీరోకు నటనలో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ లావాదేవీలు, వాటిని ఎక్కడ ఎలా భద్రపరచాలి? ఆ మొత్తాన్ని మరింతగా ఎలా పెంచాకోవాలి? అనే విషయాలన్ని ఆయన తండ్రి చూసుకునేవాడు. కానీ ఈమధ్య ఓ మనీ డీల్ విషయంలో ఆయన తండ్రికి, ఆ స్టార్ హీరోకు తాత్కాలిక మనస్పర్ధ వచ్చింది.దాంతో తన తండ్రి చేసినది తాను కూడా చేయలేనా? అని ఆ స్టార్ భావించాడు. తన మేనేజర్ మాట విని శంషాబాద్‌లో ఓ డీల్ చేయాలనే నిర్ణయానికి వచ్చి తానే సొంతగా, తన తండ్రికి తెలియకుండా ఈ మొత్తాన్ని తనకు పెద్దగా అనుభవంలేని రియల్‌ఎస్టేట్ రంగాన్ని నమ్మి ఆ డబ్బును దాచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ డబ్బును ఏమి చేయాలో తెలియక రెండు రోజులుగా నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడు. అయినా మీడియా వద్ద మాత్రం తాను ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నానని స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. మరి ఇంతలా తన ఆక్రోశాన్ని తనలోనే దాచుకొని పైకి నవ్వుతూ మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్న ఆ స్టార్ గుండెల్లోని బాధ భరించడం ఎంత కష్టమో మనం కూడా ఓసారి ప్రాక్టికల్‌గా అనుభవించితే కదా తెలుసొచ్చేది అంటూ బాధపడుతున్నాడు. ఆయన బాధను మనం కూడా పంచుకుందామంటే ఆయన పేరు చెబితే మన ఘనాభిమానులు మండిపడి వాటిని ఖండిస్తూ మనకి నిద్ర లేకుండా చేస్తారు కదా.! ఎవరి పాపం వారిది అని సరిపెట్టుకోవాల్సిందే.