నటుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇండియన్ మూవీ మేకర్స్ పై అరుంధతి విలన్ సోనూసూద్ ఫైర్ అయ్యాడు. సినిమా నిర్మాణ సమయంలో చిత్ర యూనిట్ నటుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం వహించిందో కన్నడ చిత్రం మాస్తి గుడి విషయంలో రుజువైంది. కేవలం వారి నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇద్దరి నిండు జీవితాలు గాలిలో కలిసిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా నటుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారంటూ సోనూసోద్ ఆరోపించాడు.
సోనూసూద్ ఈ విషయంపై స్పందిస్తూ 'మాస్తిగుడి మేకింగ్ వీడియా చూశాను. అది చూసినప్పుడు ఈ చిత్ర యూనిట్ ఎంత నిర్లక్షంగా వ్యవహరించిందో అర్థమౌతుంది. అక్కడ అనిల్, ఉదయ్ అన్న ఇద్దరి నటులకు ఈత రాదని ముందే తెలియజేసినప్పటికీ ప్రొడ్యూసర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దారణమైన విషయం' గా ఆయన వెల్లడించాడు. తనూ కూడా కొన్ని రిస్కీ షాట్స్ చేసేప్పుడు సేప్టీ నెట్ లేకుండా చేసిన సందర్బాలు ఉన్నాయి అలాంటి దారుణమైన రీతిలో మనం ఉన్నాం అంటూ పరిశ్రమకు చురకలు అంటించాడు.
కాగా తాను ఇప్పుడు జాకీచాన్ చిత్రంలో కుంగ్ ఫూ యోగా చిత్రంలో నటిస్తున్నానని, ఇక్కడ అసలు అంబులెన్స్, డాక్టర్స్ లేకుండా ఏ రోజూ, ఎక్కడా షూటింగ్ ఉండదన్నాడు. ఇంకా అలాంటి పటిష్టమైన వ్యవస్థ మనకు లేకపోవడం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని కూడా వివరించాడు. మొత్తానికి నటుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇండియన్ ప్రొడ్యూసర్లకు దిమ్మదిరిగేలా సోనూసూద్ స్పందించేశాడు.