Advertisementt

పవన్ సినిమాలో రకుల్ కి ఛాన్స్.!

Sat 12th Nov 2016 12:36 PM
rakul preeth singh,heroine rakul,rakul in pawan movie,pavan latest movie in rakul preeth singh  పవన్ సినిమాలో రకుల్ కి ఛాన్స్.!
పవన్ సినిమాలో రకుల్ కి ఛాన్స్.!
Advertisement
Ads by CJ
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ పవన్ తో జట కట్టేందుకు సిద్దం అవుతుంది. అటు రాజకీయాలలోనూ, ఇటు సినిమాలలో అమిత వేగంతో దూసుకుపోతున్న పవన్ స్టార్ ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ జరుగుతుండగానే మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రారంభోత్సవాలు కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇంకా హీరోయిన్ ఎంపిక విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పవన్ హీరోగా ఏఏం రత్నం నిర్మాణంలో వేదాళం రీమేక్ చిత్రానికి ఆర్ టీ నీసన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసేందుకు ఈ చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో దర్శక నిర్మాతలతో పాటు హీరో పవన్ కూడా నయనతారను కాదని రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా పెట్టేందుకు  ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
కాగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువ చిత్రంలో ఓ పాట చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ తో కలిసి థాయ్ లాండ్ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే రకుల్ ఇండియాకు వచ్చిన వెంటనే పవన్ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఓ స్పష్టత వస్తుందని తెలుస్తుంది. మెగా కుటుంబంలో రామ్ చరణ్ తో కలిసి వరుసగా రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటికి పవన్  సినిమాలో ఛాన్స్ దొరకడం అదృష్టమనే చెప్పాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో భాగంగా 2017 నాటికి వరుసలో ఉన్న సినిమాలను కూడా ముగించేయాలన్న ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకనే వరుసలో ఉన్న రెండు సినిమాలకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తాని పవన్ సినిమాలో రకుల్ ఛాన్స్ కొట్టేసిందంటే రకుల్ అదృష్టమనే చెప్పాలి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ