Advertisementt

శ్రీదేవి కూతురికి కండిషన్స్ అప్లై..!

Fri 11th Nov 2016 09:35 PM
sridevi,heroine sridevi,sridevi conditions for her daughter jhanvi  శ్రీదేవి కూతురికి కండిషన్స్ అప్లై..!
శ్రీదేవి కూతురికి కండిషన్స్ అప్లై..!
Advertisement
Ads by CJ
అలనాటి అందాల నటి శ్రీదేవి తన కూతురుని ఇప్పటి నుంచే అదుపులో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినీ అరంగేట్రం గురించి అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అలాంటి వాటిపై శ్రీదేవి స్పందిస్తూ తన కూతురుకు ఇంకా చాలా టైమ్ ఉందని, త్వరలోనే సినీరంగ ప్రవేశం ఉంటుందని ఊరిస్తూ ఉంది. తాజాగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఓ పార్టీకి వెళ్లి చేసిన అల్లరిపై తల్లి మండిపడుతుంది. ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ప్రవేశించాలనుకుంటున్న శ్రీదేవి కూతురుపై ఆదిలోనే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటంతో కూతురు జాహ్నవి కపూర్ తో  శ్రీదేవి కాస్త కటువుగానే వ్యవహరించినట్లు తెలుస్తుంది.
తాజాగా సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో పార్టీలో తెగ రెచ్చిపోయి మరీ ఎంజాయ్ చేసింది జాహ్నవి కపూర్. శిఖర్ తో ముద్దులాడుతూ అమ్మడు అడ్డంగా ఫోటోల ద్వారా దొరికిపోయింది. దాంతో శ్రీదేవికి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చి కూతురుపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించిందని తెలుస్తుంది. జాహ్నవికపూర్  బుగ్గలపై శిఖర్ ముద్దుపెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దాంతోపాటు ఇద్దరూ లిప్ లాక్ వేసుకున్న ఫోటో కూడా బయటకు రావడంతో ఇక శ్రీదేవి అగ్గిమీద గుగ్గిలం అయిందని తెలుస్తుంది. ఇక నుండి జాహ్నవికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదని, ఆ విషయం తెలిస్తే ఇక ఊరుకునేదే లేదని తెగేసి చెప్పేసిందట శ్రీదేవి. ఇప్పటి వరకు తనకున్న ఫ్రెండ్స్ లలో ఒక్కరు కూడా అబ్బాయి ఉండకూడదని కూడా తెగేసి చెప్పేసిందట అందాల నటి శ్రీదేవి. దీంతో కూతురు జాన్వికి ఒక్కసారిగా దిమ్మతిరిగినంత పనైంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ