బొగ్గు మసి అంటిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు కొంత ఊరట లభించింది. మసి కారణంగా ఆయన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకుగాను ప్రతిఫలం ముట్టిందనే ఆరోపణలు ఆయనపై ఉన్న విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ దర్వాప్తు చేస్తోందని పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఏనాడు కూడా దాసరి ఈ ఆరోపణలను వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తాజా సమాచారం ఏమంటే ఆయనకు ఊరటకలిగించే పరిణామం చోటుచేసుకుంది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో బొగ్గు బ్లాకు కేటాయింపులో లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారనే దానిపై ప్రత్యేక న్యాయం స్థానం విచారిస్తోంది. ఇందులో అదనపు నిందితునిగా దాసరి నారాయణరావు పేరు చేర్చాల్సిందిగా వేసిన వ్యాజ్యాన్ని న్యాయ స్థానం కొట్టివేసింది. ఇది దాసరికి ఊరట కలిగించే విషయమే.