Advertisementt

బాబాయ్ కు దగ్గరయ్యేందుకు అబ్బాయ్ ప్రయత్నాలు..!

Fri 11th Nov 2016 01:19 PM
balakrishna,jr ntr,nandamuri fans,gautamiputra satakarni,special show  బాబాయ్ కు దగ్గరయ్యేందుకు అబ్బాయ్ ప్రయత్నాలు..!
బాబాయ్ కు దగ్గరయ్యేందుకు అబ్బాయ్ ప్రయత్నాలు..!
Advertisement
Ads by CJ

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ల  మ‌ధ్య  చాలా కాలం నుండి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏర్పడిన గ్యాప్ ను బర్తీ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏ విధంగానైనా బాబాయ్ కు దగ్గరై ఇద్దరి మధ్య గ్యాప్ ను బర్తీ చేయాలన్న తలంపుతో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకు కొంతకాలం నుండి బాబాయ్ ను పొగడుతూ... ముందే బాలకృష్ణ మనసును గెలవాలనుకొని అందుకు తగిన ప్రయత్నాలు మొదలెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.  ఈ మధ్య విడుదలైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ ను చూసిన  జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణను తెగ పొగిడేశాడు. అసలు గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ అద్భుతం అంటూనే, ఇంకా ఈ సినిమాను చూసేందుకు తాను అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాన‌ంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

అయితే బాబాయ్ కి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఎన్టీఆర్ ప‌క్కా ప్లాన్‌తో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్, శాతకర్ణి సినిమాను పొగిడిన విషయం సామాజిక మాధ్య‌మాల ద్వారా విన్న బాలకృష్ణ అందుకు తగిన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా.... తాను హీరోగా త్వ‌ర‌లో ప్రారంభమయ్యే ఎన్టీఆర్ సినిమాకి బాబాయ్‌ని ఆహ్వానించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడట‌ జూనియర ఎన్టీఆర్. ఇంకా.. గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి ప్రివ్యూషోని బాబాయ్‌తో క‌లిసే చూసేందుకు ఎన్టీఆర్ అమితంగా ఆస‌క్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుగుతున్న పరిణామాలను బట్టి బాబాయ్‌, అబ్బాయ్ ఒక‌ట‌వుతారన్న ప్ర‌చారం ముమ్మరంగా జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకేంటి ఈ సారి సంక్రాంతికి నందమూరి అభిమానుల సంబురాలు జరగనున్నాయన్న మాట.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ